గుడ్ న్యూస్.. నిరుద్యోగులకు ఉచిత కోచింగ్ సెంటర్ల ఏర్పాటు..
దేశం లోనే తొలి సారిగా రాష్ట్రం లో నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 బీసీ స్టడీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. జూన్ 2 న ఈ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వెనుకబడిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతి బాపూలే ఆశయాలను సీఎం కేసీఆర్ సాకారం చేశారని వెల్లడించారు. డిజిటల్ స్టూడియో లో రూపొందించిన పాఠాలను యూట్యూబ్ ద్వారా ప్రసారం చేస్తామని తెలిపారు. బీసీ స్టడీ సెంటర్లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు కూడా అందిస్తామని ఆయన అన్నారు.
స్టడీ సెంటర్లలో అత్యాధునిక కంప్యూటర్లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సిద్దిపేట, గద్వాలలో నూతన స్టడీ సర్కిళ్లను ప్రారంభించామన్నారు. సిరి సిల్లలో త్వరలో స్టడీ సర్కిల్ ను ఏర్పాటు చేస్తామన్నారు. ఇలాగే ప్రతీ నియోజక వర్గంలో ఏర్పాటు చేసే దిశగా చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. త్వరలో తెలంగాణలో రాబోయో అన్ని నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకునే కొత్త అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ను కల్పిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ యువతకు బంగారు భవిష్యత్ కోసం సర్కార్ ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. కేసీఆర్ గారి ఆలోచన వల్ల రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఉండదని మంత్రి హర్షం వ్యక్తం చేశారు..