ఇంజనీరింగ్ విద్యార్థులకు ఏఐసీటీఈ గుడ్ న్యూస్..
ఏఐసీటీఈ ఇప్పుడు ఆ సబ్జెక్టులను చాయిస్ కిందకు వదిలేసింది. బీటెక్ లో ప్రవేశం కోసం ప్రయత్నించే విద్యార్థులు నాలుగు సబ్జెక్ట్ లలో పాసయ్యి ఉండాలి. ఫిజిక్స్, మ్యాథ మెటిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయాలజీ, ఇన్ ఫర్మేటిక్స్ ప్రాక్టిసెస్, బయో టెక్నాలజీ, టెక్నికల్ ఒకేషనల్ సబ్జెక్ట్, అగ్రికల్చర్, ఇంజినీరింగ్ గ్రాఫిక్స్, బిజినెస్ స్టడీస్, ఎంటర్ప్రెన్యూర్షిప్...
ఈ సబ్జెక్ట్ లలో జనరల్ అభ్యర్థులు 45 శాతం, రిజర్వు కేటగిరి అభ్యర్థులు 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుందని ఏఐసీటీఈ పేర్కొంది. కాగా ఇంజినీరింగ్ కోర్సుకు ఫిజిక్స్, మ్యాథ్స్ పూర్తిగా అవసరమని చాలా మంది నిపుణులు పేర్కొన్నారు. ఏఐసీటీఈ తన నిర్ణయాన్ని పునః పరిశీలించాల్సిందిగా కోరారు. ఏఐసీటీఈ చైర్మన్ అనిల్ డి సహస్రబుధే స్పందిస్తూ.. ఈ చర్య జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా సౌలభ్యాన్ని ఇస్తుందన్నారు. కాగా, ఇంజనీరింగ్ ను పూర్తిగా అర్థం చేసుకోవాలని అంటేవ్ ఫిజిక్స్, మ్యాథ్స్ ముఖ్యమైనవి అని ఆయన వ్యాఖ్యానించారు. విద్యార్థులకు చాలా బ్రిడ్జి కోర్సులు అవసరమౌతాయన్నారు.. మ్యాథ్స్ ,ఫిజిక్స్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష లకు అంత కీలకం కాకపోయినా కూడా సబ్జెక్ట్ లు ఇంజనీరింగ్ లో కీలకమని పేర్కొన్నారు..