త్వరపడండి..IOCL లో 346 ఉద్యోగాలు..? అప్లై చేసుకోవడానికి ఇక కొద్ది రోజులే గడువు..!

Divya

ప్రస్తుతం మన దేశంలో నిరుద్యోగం చాలా ఎక్కువగానే ఉంది. అందుకోసం ఏదో ఒక నోటిఫికేషన్ వెలువడుతూనే ఉంటుంది. అందులో ఇదీ ఒకటి.   IOCL ( oil CORPORATION' target='_blank' title='ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెక్నికల్, నాన్  టెక్నికల్, అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తోంది. మొత్తం ఖాళీల సంఖ్య 346 ఉన్నట్లు ప్రకటించింది.

ఈ  పోస్టులు రాష్ట్రాల వారిగా  మహారాష్ట్ర,గుజరాత్,మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్,గోవా,  దాద్రా నగర్ అండ్ హవేలీ   లో ఈ పోస్టులు ఉన్నాయి. ఇది కేవలం అప్రెంటిస్ పోస్టులు మాత్రమే.. ఏడాదికాలం అప్రెంటిస్ శిక్షణ ఉంటుంది. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలకు కోసం https://iocl.com/ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.

అంతేకాకుండా ట్రైడ్ అప్రెంటిస్  అభ్యర్థులు https://apprenticeshipindia.org/ వెబ్సైట్లో, మరియు టెక్నీషియన్ అప్రెంటిస్ అభ్యర్థులు  https://portal.mhrdnats.gov.in/ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేయాలి.

IOCL RECRUMENT 2021 : ఖాళీల వివరాలివే..
 మొత్తం ఖాళీలు -346
 గుజరాత్- 72
 చత్తీస్గడ్ -9
 మహారాష్ట్ర -187
 గోవా -7
 మహారాష్ట్ర -18
 మధ్యప్రదేశ్ -25
 దాద్రా నగర్ అండ్ హవేలి -4
 గుజరాత్ -24
 దరఖాస్తు ప్రారంభం -2021 ఫిబ్రవరి 5
 దరఖాస్తుకు చివరి తేదీ - 2021 మార్చి 7
 రాత పరీక్ష -2021 మార్చి -21
 ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రకటన -2021 మార్చి -25
విద్యార్హతలు: ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు ఫిట్టర్, ఎలక్ట్రీషియన్,  ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్ ట్రేడ్ లో ఐటిఐ పాస్ కావాలి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ లో మూడేళ్లు డిప్లమా పాస్ కావాలి. ట్రేడ్ అప్రెంటీస్ అకౌంటెంట్ పోస్టులకు,  డిగ్రీ పాస్ కావాలి. ప్రైడ్ అప్రెంటిస్ డేటా ఎంట్రీ  పోస్టులకు 12వ తరగతితో పాటు డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ లో స్కిల్ సర్టిఫికెట్ ఉండాలి. ప్రైడ్ అప్రెంటిస్ రిటైల్ సేల్స్ అసోసియేట్ పోస్ట్ కు 12వ తరగతి తో పాటు రిటైల్ ట్రైన్ అసోసియేట్ లో స్కిల్ సర్టిఫికెట్  ఉండాలి.
వయసు -18 నుంచి 24 ఏళ్లు మించకూడదు
ఎంపిక విధానం -రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: