ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త..! APSSDC లో ఉద్యోగాలు భర్తీ..?

frame ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త..! APSSDC లో ఉద్యోగాలు భర్తీ..?

Divya

 గత ఒకటిన్నర సంవత్సరం నుంచి ప్రపంచ దేశాల ప్రజలందరూ, కరోనా మహమ్మారి కారణంగా  ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అయితే  ఇప్పుడున్న ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక జాబ్ లేదా పని  చేయవలసిందే. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఒక్కో కుటుంబానికి నెలసరి ఆదాయం రూ.20000 అయినా సరిపోవట్లేదు. ఎందుకంటే రోజురోజుకు నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయి . సామాన్యుడిపై భారం పడుతోంది . ఇలాంటి విపత్కర పరిస్థితుల నుంచి బయట పడాలంటే తప్పనిసరిగా ఏదో ఒక జాబ్ చేయాల్సిందే.. ఇలాంటి నిరుద్యోగులకు ఊరటనిచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి మరో ఉద్యోగ ప్రకటన విడుదలైంది. HBL ఇండస్ట్రియల్ సంస్థ ఉద్యోగాల భర్తీ చేసేందుకు ప్రకటన విడుదల చేసింది.

నిరుద్యోగులు, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మార్చి 5వ తేదీ ఉదయం 9 గంటలకు MIRIAM degree college, amalapuram లో నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు చెందిన అధికార వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని APSSDC వారు స్పష్టం చేశారు.

మొత్తం 200 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు APSSDC వారు తెలిపారు. అందులో ఐటిఐ (ఫిట్టర్,డీజిల్ మెకానిక్ ), డిప్లమా,  బీటెక్  ( మెకానికల్, ఎలక్ట్రికల్) విద్యార్హత కలిగిన వారు ఇంటర్వ్యూకు అర్హులు.

అభ్యర్థుల వయస్సు 18 నుంచి 28 ఏళ్ల  మధ్య ఉండాలి. ఈ పోస్టులకు కేవలం పురుషులు మాత్రమే అర్హులు. టెక్నికల్ విభాగంలో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అభ్యర్థులకు నెలకు  రూ. 12000 వేతనంతో పాటు పీ ఎఫ్, ఈ ఎస్ ఐ, ఫుడ్, వసతి సదుపాయం ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు విజయనగరం లో పని చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇంతకాలం నిరుద్యోగ సమస్యతో ఎదురుచూస్తున్న ఎంతోమంది విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని APSSDC కొంత వారు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: