ప్రైవేట్ కాలేజీలకు భారీ షాక్ ఇచ్చిన జగన్ సర్కార్..
కేవలం ఆ సదుపాయాలు అన్నీ ప్రభుత్వ కాలేజీలో చదివేవాల్లకు మాత్రమే వర్తిస్తుందని వెల్లడించారు. గవర్నమెంట్ యూనివర్శిటీలు, ప్రభుత్వ పీజీ కాలేజీల విద్యార్థులకు మాత్రమే అవి వర్తిస్తాయని స్పష్టం చేసింది. దీనిపై ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్ సీఈవో చర్యలు తీసుకోవాలని సూచించింది. తాజా ఉత్తర్వుల నేపథ్యంలో.. ప్రైవేట్ పీజీ కాలేజీల్లో చదివే విద్యార్థులకు కూడా జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనలను అమలు చేయాలని విద్యార్థులు, సంఘాలు, తల్లి దండ్రులు కోరుతున్నారు.. అందరికీ ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు రావాలంటే కుదరదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..
రాష్ట్రవ్యాప్తంగా సెల్ఫ్ ఫైనాన్స్ పద్దతిలో 158 ప్రైవేట్ కాలేజీలు నడుస్తున్నాయి. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన విషయంపై టిడిపి సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 'క్రిస్మస్ కానుక కింద పీజీ విద్యార్థులకి ఫీజు రీయింబర్సుమెంటుని రద్దు చేసిన ప్రభుత్వం. విద్యార్థుల ఎన్నో చేస్తామని అంటారు. కానీ ఉన్న వాటిని ఎత్తి వేసి వాళ్ళ జీవితాలపై జగన్ సర్కార్ కొడుతుందని ఆయన పేర్కొన్నారు.అది చేస్తాం.. ఇది చేస్తాం అని చెప్పి ఇప్పుడు రద్దులు చేసి రోడ్డున పడేస్తున్నారు' అంటూ మండిపడ్డారు... ప్రస్తుతం ఈ విషయం రాజకీయ చర్చలకు దారి తీస్తుంది..జగన్ సర్కార్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి...