దేశ వ్యాప్తంగా పాఠశాలలు మరియు కళాశాలలు తెరుచుకోక చాలా నెలలే అవుతుంది .. ఇప్పటికే కొన్ని విద్యా సంస్థలు ఆన్లైన్ బోధన చేయగా ఆలా ఎంత కాలం కొనసాగించాలి అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతుంది ... ఆన్లైన్ బోధన దేశం లోని విద్యార్థులందరికీ సరిగా అందడం లేదు .. ఒక్కోసారి టీచర్లు చెప్పే పాఠాలు అర్థం కాకా విద్యార్థులు సతమతమవుతున్నారు .. దింతో రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలల్ని తెరవడం పై ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది .. ఇంకొన్ని రోజులతో ఈ సంవత్సరం ముగుస్తున్న కారణంగా ఈ విద్యా సంవత్సరం నష్టపోకుండా అతి త్వరలో పాఠశాలల్ని తెరిచేందుకు ప్రభుత్వాలు సన్నద్ధం అవుతున్నాయి ... అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల్ని మరియు కళాశాలలని తెరిచేందుకు రెడీ అవుతుంది .. అతి త్వరలో తెలంగాణ లో బడి గంటలు మోగనున్నాయి .. కరోనా కారణంగా తెలంగాణలోను పాఠశాలలు మూతబడ్డాయి ఇప్పటికి తెరుచుకోలేదు. అయితే ఈ విద్యా సంవత్సరం ముగియడానికి మరి కొన్ని నెలలు మాత్రమే మిగలడంతో పాఠశాలలు తెరవాలని ప్రభుత్వం భావిస్తోంది. వార్షిక పరీక్షలు నిర్వహించే ముందు పాఠశాలలను కనీసం మూడునెలలపాటు తెరవాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ భావిస్తున్నట్లు సమాచారం.
తెలంగాణ ప్రభుత్వం జనవరి నాలుగో తేదీ నుంచే పాఠశాలలు, మరియు కళాశాలలను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా మొదటగా పాఠశాలలో 9, 10 తరగతులలని మాత్రమే ప్రారంభించాలని ప్రయత్నాలు చేస్తోంది .. దానితో పటు జూనియర్ కాలేజీలను కూడా ప్రారంభించి క్లాసులు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లను చేస్తోంది... అందుకు సంబందించిన ప్రతిపాదనలను సీఎం కేసీఆర్‌కు పంపించామని విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఆన్‌లైన్ క్లాసుల పట్ల విద్యార్థులకు ఆసక్తి తగ్గిపోతున్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని మంత్రి చెప్పారు. ఈ మేరకు స్కూల్స్ తెరవాలని ప్రభుత్వ స్కూల్ టీచర్ల సంఘాల నుండి మరియు , ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల నుండి పెద్దఎత్తున డిమాండ్లు వస్తున్నాయని ఆమె అన్నారు ..ఈ విషయం పై రాష్ట్రప్రభుత్వం తొందరలో ఒక ప్రకటన చేస్తుందని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు .. ఒక్క తెలంగాణ లోనే కాకుండా మిగతా రాష్ట్రాలలోనూ జనవరి నెల లోనే పాఠశాలలను పునప్రారంభించేలా ఏర్పాట్లను చేయబోతున్నట్లు వార్తలు వినబడుతున్నాయి ..
మరింత సమాచారం తెలుసుకోండి: