డిప్లొమా అభ్యర్థులకు గుడ్ న్యూస్.. స్టైపెండ్‌తో పాటు అప్రెంటిస్ శిక్షణ..!!
తాజాగా భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నిర్వహించిన ఇంజనీరింగ్ డిప్లొమా అభ్యర్థుల నుంచి టెక్నీషియన్ అప్రెంటిస్ గా శిక్షణ పొందటానికి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. వీటిలో ఉత్తీర్ణత పొందిన విద్యార్థులకు అప్రెంటిస్‌షిప్ చట్టం, 1961 ప్రకారం నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ కింద దాదాపు ఏడాది వరకు కర్ణాటక బెంగుళూరు లోని బెల్ లో శిక్షణను ఇప్పిస్తున్నారు.
ఈ పరీక్షల పై ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సంబంధిత అధికారులు తాజాగా వెల్లడించారు. అక్టోబర్ 27 నుంచి నవంబర్ 15 వరకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు తెలిపారు. ఇందులో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ప్రతి నెల రూ. పదివేల నాలుగోందలు స్టైపెండ్‌తో పాటు అప్రెంటిస్ శిక్షణ కూడా ఇస్తున్నట్లు ప్రకటించారు.విద్యార్థులు టెన్త్, డిప్లొమాలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. అభ్యర్థులు https://www.mhrdnats.gov.in/ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి..
ఈ బెల్ పరీక్షలకు అర్హత..
ఇంజినీరింగ్ లో మూడేళ్ల డిప్లొమా ను తప్పని సరిగా పూర్తి చేసి ఉండాలి..
జనవరి 1, 2018 వ సంవత్సరం తర్వాత డిప్లొమా డిగ్రీని పూర్తి చేసి ఉండాలి..
అప్పటివరకు పొందిన ఇంజినీరింగ్ ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికెట్లు అంటే సెమిస్టర్ వైజ్ మార్క్ మెమో లను కలిగి ఉండాలి..
వీటిలో ఏ ఒక్కటి లేకపోయిన వారు ఈ పరీక్షలకు అర్హులు కారు.. పైన తెలిపిన లింక్ ను ఓపెన్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు..