ఆర్ఆర్‌బీ అభ్యర్థులకు రైల్వే మంత్రి గుడ్ న్యూస్..!

frame ఆర్ఆర్‌బీ అభ్యర్థులకు రైల్వే మంత్రి గుడ్ న్యూస్..!

Kothuru Ram Kumar
దేశంలో కరోనా వైరస్ కారణంగా అన్ని పోటీ పరీక్షలు వాయిదా పడిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్ష కోసం కోటి మందికి పైగా అభ్యర్థులు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని 2020 డిసెంబర్ 15 నుంచి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తామని పీయూష్ గోయల్ వివరించారు. డిసెంబర్‌లో కోరనా వైరస్ క్షేత్ర స్థాయి పరిస్థితులను అంచనా వేసి రిక్రూట్‌ మెంట్ ఎగ్జామ్స్ పూర్తి చేస్తామని తెలిపారు.
ఇక 2020 డిసెంబర్ 15 నుంచి ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షలు ఉంటాయని ఇప్పటికే భారతీయ రైల్వే శాఖ ప్రకటించింది. అయితే ఇప్పటికీ ఈ పరీక్షల నిర్వహణపై అనేక సందేహాలు, అనుమానాలు ఉన్నాయని తెలిపారు. దీంతో వీటిపై రైల్వే మంత్రి లోక్‌సభకు రాతపూర్వక సమాధానంలో వివరణ ఇచ్చారు.  ఇక ఇప్పటికే గ్రూప్ డీ, అసిస్టెంట్ లోకో పైలట్స్ - ALP, టెక్నీషియన్ ఖాళీల భర్తీ ప్రక్రియ పూర్తైందని తెలిపారు. కొందరు ఏఎల్‌పీ అభ్యర్థులకు అపాయింట్‌మెంట్ లెటర్స్ రాలేదని తెలిపారు. సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 01/2018 అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్ అభ్యర్థులకు అపాయింట్‌మెంట్ లెటర్స్ ఇచ్చే ప్రక్రియపై కరోనా వైరస్ సంక్షోభం, లాక్‌ డౌన్ ప్రభావం చూపిందన్నారు.
అన్‌లాక్ ప్రక్రియ కొనసాగుతుండటంతో నియామక ప్రక్రియను దశలవారీగా ప్రారంభిస్తున్నామని, అభ్యర్థులకు అపాయింట్‌మెంట్ లెటర్స్ త్వరలోనే వస్తాయని వివరించారు. గ్రూప్‌డీ, ఏఎల్‌పీ, టెక్నీషియన్ నియామక ప్రక్రియ పూర్తి కాగానే, రైల్వే రిక్రూట్‌మెట్ బోర్డు నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ - NTPC పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్స్ నిర్వహిస్తుందన్నారు. ఇక ఆర్ఆర్‌బీ ఇప్పటికే ఎన్‌టీపీసీ దరఖాస్తులను పరిశీలించింది. అభ్యర్థులను అప్లికేషన్ స్టేటస్ చూసుకోవాలని కోరింది. ఇందుకోసం అప్లికేషన్ స్టేటస్ లింక్ యాక్టివేట్ చేసింది. అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి మరో వారం మాత్రమే గడువు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: