వావ్... గూగుల్ లో జాబ్ వస్తే ఇన్ని సౌకర్యాలా..? చదివితే దిమ్మతిరగాల్సిందే..!?

గూగుల్ ప్రపంచంలోనే అత్యుత్తమ కంపెనీల్లో ఒకటి. ఆ సంస్థ ఇటీవల తన ఉద్యోగుల కోసం ఫ్రైడే కూడా సెలవు ఇచ్చింది అనేది బాగా వైరల్ అయ్యింది. అయితే అందులో వాస్తవాలేంటో.. గూగుల్‌లో ఎలాంటి సౌకర్యాలు ఉంటాయో ఓ గూగుల్ ఉద్యోగి సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్టు పెట్టారు. ఆ లేఖ మీరూ చదవండి. గూగుల్‌లో ఎన్ని సౌకర్యాలు ఉన్నాయో తెలుసుకోండి.. ఇదీ ఆ లేఖ..

Google సంచలన నిర్ణయం... ఇక నుంచి friday కూడా holiday... నిజమేనా? మా కంపనీలో వారానికి రెండు రోజులు (Saturday-Sunday) సెలవు ఉంటుంది. కొద్దిరోజుల క్రితం మా CEO sundar Pichai కరోనా టైంలో ఇబ్బందులు పడుతున్న మా ఉద్యోగులకు "Friday" సెలవు ప్రకటించాడు. అందరూ తమ కుటుంబ సభ్యులతో సమయం గడిపి, పని గురించి ఆలోచించొద్దు అని మాకందరికీ పర్సనల్ మేసేజ్ పంపాడు.  దీంతో మీడియా (ముఖ్యంగా అతి చేయడంలో ఎప్పుడూ ముందుండే తెలుగు మీడియా) ఈ విషయాన్ని సంచలన నిర్ణయం అని ప్రచారం చేయడం మొదలుపెట్టింది. వారానికి నాలుగు రోజులు పని, మూడు రోజులు సెలవు అంటే ఎగిరి గంతేస్తారు. కానీ ఇక్కడే కొందరు డీటైల్స్ చూడకుండా Fridayతో కలిపి వారానికి మూడు రోజులు week off అని నిర్ణయాకొచ్చారు.


Friday సెలవు నిజమే కానీ, ప్రతీ friday కాదు. september 4th మాత్రమే సెలవు. USAలో 7th September(సోమవారం) labor holiday ఉంది. ముందువారం friday కలిపి నాలుగు రోజులు సెలవొచ్చింది. అంతేకాని ప్రతీ friday సెలవు కాదు. Ofcourse, కరోనా పేరుతో జీతలు కట్ చేసే కంపనీలు, ఉద్యోగాలు తీసేసే కంపనీలు ఉన్న టైంలో ఉద్యోగుల బాగోగులు చూసే Googleలో పని చేయడం ఒక అదృష్టమనే చెప్పాలి. సందర్భం వచ్చింది కాబట్టి కరోన టైంలో మా కంపనీ మాకు ఇచ్చిన/ఇస్తున్న కొన్ని facilities ఇవి.....

- వర్క్ ఫ్రం హోం కోసం ఇంటికి laptop, LCD screen, printer, head phones లాంటివి పంపారు.
- ప్రతీ ఉద్యోగికీ 1000 డాలర్స్ (రూ.75,000) స్పెషల్ బోనస్. ఏం కావాలన్నా కొనుక్కోవచ్చు.
- ప్రతీ ఉద్యోగికీ 3 నెలాలు కరోనా సెలవు. ఈ మూడు నెలాలు ఎలాగైనా వాడుకోవచ్చు. వారాల లెక్కన, లేదా రోజుల లెక్కన సెలవు తీస్కోవచ్చు. కావాలంటే రోజుకు 4 గంటలు మాత్రమే పని చేసి ఆర్నెల్ల పాటు half day పని చేయొచ్చు.
- మామూలుగా మాకిచ్చే రూ.10లక్షల మెడికల్ ఇన్స్యూరన్స్ కాకుండా కరోనా ట్రీట్‌మెంట్ కోసం అదనంగా ఇంకో రూ.10 లక్షలు
- జీతంలో ఎలాంటి కోతలు ఉండవు, బోనస్, shares అన్నీ ఎలాంటి కోతలు లేకుండా ఇస్తారు.
- promotions, ప్రతీ ఏడాది జనవరిలో పెరిగే జీతాలు కూడా కచ్చితంగా ఇస్తారు.
- ఉద్యోగులందరూ వచ్చే ఏడాది (2021) june 30 దాకా ఇంటి నుంచే పని చేయాలి. ఆ తర్వాత కూడా ఇబ్బంది ఉన్నవాల్లు వర్క్ ఫ్రం హోం కొనసాగించవచ్చు.
ఇన్ని సౌకర్యాలు, ఇంత భరోసా ఇచ్చే Googleలో పని చేయడానికి వారానికి మూడు రోజులు సెలవెందుకు చెప్పండి. Thank you Google!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: