హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే!!

Kavya Nekkanti

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ కంటికి క‌నిపించ‌కుండా.. ప్ర‌పంచ‌దేశాల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు చిన్నా.. పెద్దా అని తేడా లేకుండా అన్ని దేశాలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ ప్రాణాంత‌క వైర‌స్‌కు వ్యాక్సిన్ కూడా అందుబాటులో లేక‌పోవ‌డంతో.. దీని క‌ట్ట‌డి చేయ‌డం పెద్ద స‌వాల్‌గా మారింది. మ‌రోవైపు క‌రోనా దెబ్బ‌కు ప్ర‌జలంద‌రూ ఇళ్లకే పరిమితమైంది. ఈ క్రమంలోనే చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి.. రోడ్డున ప‌డుతున్నాయి. 

అయితే ఇలాంటి స‌మ‌యంలో హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తూ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్‌లో మొత్తం 290 పోస్టులు ఉన్నాయి. ఫిట్టర్, టర్నర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్ లాంటి పోస్టులున్నాయి. వీటి పూర్తి వివ‌రాలు చూస్తే.. మొత్తం 290 పోస్టుల్లో మేట్ (మైన్స్)- 60, బ్లాస్టర్ (మైన్స్)- 100, ఫిట్టర్- 30, టర్నర్- 5, వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్)- 25, ఎలక్ట్రీషియన్- 40, ఎలక్ట్రానిక్స్ మెకానిక్- 6, డ్రాఫ్ట్స్‌మ్యాన్ (సివిల్)- 2, డ్రాఫ్ట్స్‌మ్యాన్ (మెకానికల్)- 6, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్- 2, సర్వేయర్- 5 ఖాళీలు ఉన్నాయి.

వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఐటీఐ, డిప్లొమా, బీఈ పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. అదేవిధంగా, ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థుల వయస్సు 18 నుంచి 30 ఏళ్ల లోపు ఉండాల‌ని నోటిఫికేష‌న్‌లో పేర్కొంది. ఇక ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.hindustancopper.com/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు. కాగా, ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్ప‌టికే ప్రారంభ‌మైంది. ద‌ర‌ఖాస్తు చేయడానికి జూలై 25 చివరి తేదీగా ప్ర‌క‌టించింది. అంటే మ‌రో రెండు రోజులు మాత్ర‌మే గ‌డువు మిగిలి ఉంది. కాబ‌ట్టి, ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు నోటిఫికేష‌న్ పూర్తి వివ‌రాలు తెలుసుకుని.. వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌లెను. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: