డబ్ల్యూఐఐలో ఉద్యోగాలు.. అర్హత, లాస్ట్ డేట్ వివరాలివే..?

ఉత్తరాంఖండ్ లోని డెహ్రాడూన్ లో ఉన్న వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా.. డబ్ల్యూఐఐ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. కాకపోతే ఇవి ఒప్పంద ప్రాతిపదికన కింద నియమించ బడే పోస్టులు. ప్రస్తుతం WII ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో వంటి 24 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటి భర్తీ కోసమే ఈ నోటిఫికేషన్. ఈ ఉద్యోగాలకు అర్హత విషయానికి వస్తే.. సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత తప్పనిసరి. అంతే కాదు.. పరిశోధన అనుభవం కూడా అవసరం.

ఆన్‌లైన్‌ ద్వారా ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిఉంటుంది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 23, 2020 ముగుస్తుంది. మరిన్ని వివరాల కోసం ఆ సంస్థ వెబ్ సైట్ ను చూడవచ్చు. ఈ సమాచారం మీకు ఉపయోగపడవచ్చు. పడకపోవచ్చు. కానీ దీన్ని మీ వాట్సప్ గ్రూపుల్లోనూ, ఫేస్ బుక్ లోనూ పోస్టు చేయండి.

అవసరమైన వారికి ఇది ఉపయోగపడుతుంది. మనం అనవసరంగా ఎన్నో పోస్టులు ఫార్వార్డ్ చేస్తుంటాం. ఇలా పనికొచ్చి ఉద్యోగ సమాచారం పంపితే ఎవరికైనా ఉపయోగపడొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: