ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో ఉద్యోగాలు..!

సికింద్రాబాద్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో టీచర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇది సికింద్రాబాద్ లోని ఆర్‌కే పురంలో ఉంది. స్కూల్ వివిధ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్‌, ట్రైన్‌డ్ గ్రాడ్యుయేట్ టీచర్‌, ప్రైమరీ టీచర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

 

మొత్తం 40 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు బీఈడీ , పీజీ తప్పనిసరి. అంతే కాదు.. బీఈడీ 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఏప్రిల్‌ 01, 2020 నాటికి 40 ఏళ్లకు మించి ఉండకూడదు.

 

ఉద్యోగాలు కోరుకునే వారు.. నేరుగా స్కూలుకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. లేదా పోస్టులో పంపించాలి. ఆన్ లైన్ దరఖాస్తు విధానం లేదు. వచ్చిన దరఖాస్తులను బట్టి స్క్రీనింగ్ టెస్ట్‌, సీఎస్‌బీ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాలు ఇస్తారు. దరఖాస్తు చేసుకునేందుకు జనవరి 05, 2020 వరకూ గడువు ఉంది.

 

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా.. సికింద్రాబాద్ ఆర్మీ పబ్లిక్ స్కూల్, ఆర్‌కే ఫ్లైఓవర్ దగ్గర, ఆర్‌కే పురం, నేరేడ్‌మెట్‌, తిరుమలగిరి, ఈసీఐఎల్ రోడ్‌, సికింద్రాబాద్‌-500056. మరిన్ని వివరాలు కోసం apsrkpuram.edu.in/vacancies/ వెబ్ సైట్ చూడొచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: