“SSC” లో భారీ నోటిఫికేషన్..
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో
వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి ఎస్ఎస్సీ (స్టాఫ్ సెలక్షన్ కమిషన్) నోటిఫికేషన్
విడుదల చేసింది. ఆయా పోస్టుల ఆధారంగా విద్యార్హతలు పేర్కొన్నారు. కంప్యూటర్ ఆధారిత
పరీక్ష ద్వారా పోస్టులను భర్తీచేస్తారు.
పోస్టుల వివరాలు..
పోస్టులు: జూనియర్ ఫిజియోథెరపిస్టులు, జూనియర్ ఇంజనీర్లు, సైంటి ఫిక్ అసిస్టెంట్స్, బొటానికల్ అసిస్టెంట్, డేటా ప్రాసెసింగ్
అసిస్టెంట్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, డైటీషియన్, క్లర్క్ తదితర ఉద్యోగా
లున్నాయి.
అర్హతలు: పదోతరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ మొదలైన కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుంది. కొన్ని
పోస్టులకు స్కిల్ టెస్ట్ సైతం నిర్వహిస్తారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షలో కనీస
మార్కులు పొందటం తప్పనిసరి. యూఆర్ కేటగిరీకి చెందిన వారు కనీసం 35 శాతం మార్కులు; ఓబీసీ అభ్యర్థులు 30 శాతం మార్కులు; ఇతరులు కనీసం 25 శాతం మార్కులు సాధించాలి.
ముఖ్య తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి
తేదీ: వాస్తవానికి దరఖాస్తుకు గడువు సెప్టెంబర్ 30, సాయంత్రం 5 గంటలు. అయితే దీన్ని
అక్టోబర్ 5వ తేదీకి పొడిగించారు. పరీక్ష తేదీలను తర్వాత
ప్రకటించనున్నారు.
దరఖాస్తు రుసుం: రూ.100. మహిళా అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్
అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్స్: www.ssconline.nic.in, https://ssc.nic.in