బీసీ అభ్యర్థులకు తీపికబురు

Shyam Rao

తెలంగాణ గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో బీసీలకు 5 శాతం మార్కుల మినహాయింపు ఇచ్చేలా రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. గతంలో ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే ఇలా మినహాయింపు ఉండేది. తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్‌సీటీఈ) నిబంధనలు పాటించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది.



ఈమేరకు గురుకుల పోస్టుల భర్తీకి డిగ్రీలో 50 శాతం మార్కులు కచ్చితంగా ఉండాలని నిర్ణయించింది. గురుకుల ఉపాధ్యాయ పోస్టులకు రెండంచెల రాతపరీక్ష, ముఖాముఖిలు నిర్వహించనుండటంతో అర్హులందరికీ అవకాశమివ్వాలని ఉన్నతాధికారులు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈమేరకు అర్హతల ప్రతిపాదనలు సిద్ధంచేసి టీఎస్‌పీఎస్సీకి పంపించేందుకు 10 రోజుల సమయం పట్టనుంది. అనంతరం కమిషన్ వివరాలను పరిశీలించి కొత్త ప్రకటనలు జారీ చేయనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: