ఏపీలో కూట‌మి పాల‌న‌కు యేడాది.. వైసీపీ గ్రాఫ్ పెరిగిందా..? త‌గ్గిందా..?

RAMAKRISHNA S.S.
- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . . .

గత ఏడాది ఎన్నికలలో వైసిపి చిత్తుచిత్తుగా ఓడిపోయింది.. కేవలం 11 సీట్లకే పరిమితమైంది. అయినా వైసీపీకి 40 శాతం కు కాస్త అటు ఇటుగా ఓటు బ్యాంకు వచ్చింది. పార్టీ చిత్తుగా ఓడిపోయిన క్షేత్రస్థాయిలో పార్టీలకి జవసత్వాలు తగ్గలేదు అని చెప్పటానికి ఇదే నిదర్శనం. పార్టీకి ప్రజలు అండగా ఉన్నారు అనినేందుకు ఒక ఉదాహరణ. ఎన్నికల అనంతరం ఏపీలో కూటమి పాలన వచ్చి యేడాది పూర్తవుతుంది. ఈ సమయంలో ప్రస్తుతం వైసీపీ ఓటు బ్యాంకు ఇంకా తగ్గిందా ? పెరిగిందా ? అనేది కీలక అంశం. ఎప్పటికప్పుడు దీనిపై కొలుచుకునే సంస్కృతి వైసిపికి లేకపోయినా .. రాజకీయ వర్గాల్లో మాత్రం వైసిపి పై అప్పుడే భారీ అంచ‌నాలు .. భారీ లెక్కలు కనిపిస్తున్నాయి. తాజాగా కొందరు చేసిన సర్వేలే కాకుండా టిడిపి అనుకూల వర్గాలు చేయించిన సర్వే లోను వైసిపి ఓటు బ్యాంకు కాస్త పెరిగినట్టు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం చాలా వరకు అంచనాలు అందుకోవటంలో విఫ‌ల‌మైంది.


చంద్రబాబు ఇచ్చిన హామీలలో చాలావరకు నెరవేర్చలేదు. దీనికి తోడు సంక్షేమం అనేది వైసిపితో పోల్చుకుంటే జీరో అని చెప్పాలి. దిగువ మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వం నుంచి నేరుగా ఎలాంటి ఆర్థిక లబ్ధి లేదన్న నిరాశ నిస్పృహ‌లు వారిలో కనిపిస్తున్నాయి. చంద్రబాబు హామీలు ఇస్తారు తప్ప వాటిని నెరవేర్చే టైం వచ్చేసరికి చేతులు ఎత్తేస్తారు అన్న అభిప్రాయాలు ఎక్కువ మందిలో వినిపిస్తున్నాయి. ఇక ఏడాది పాలనపై చేయించిన సర్వేలలోనూ ఇటు చంద్రబాబు సొంతంగా చేయించిన సర్వేలలోనూ చాలామంది ఎమ్మెల్యేల గ్రాఫ్ తగ్గిందంటున్నారు. పలు నియోజకవర్గాలలో కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలు కొంత అనాసక్తి తో ఉన్నారని .. గత ఏడాదితో పోలిస్తే కూటమీ ప్రభుత్వం పట్ల క్రేజ్ తగ్గిందన్న చర్చ‌లు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా వైసీపీ గత ఏడాదితో పోలిస్తే చాలా వరకు పుంజుకుంది అన్నమాట వాస్తవం.


ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: