ఏపీలో కూట‌మి స‌ర్కార్‌ ఉక్కు ప‌ట్టు మామూలుగా లేదే... !

frame ఏపీలో కూట‌మి స‌ర్కార్‌ ఉక్కు ప‌ట్టు మామూలుగా లేదే... !

RAMAKRISHNA S.S.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు సంబంధించి కూట‌మి ప‌ట్టు బిగించేస్తోంది. ఐదు స్థానాలూ కూడా ఏక‌గ్రీవంగా కూట‌మి పార్టీల‌కు ద‌క్క‌నున్నాయి. అంటే.. ఎలాంటి ఎన్నిక‌లు లేకుండానే ఈ స్థానాల‌కు నామినేష‌న్ వేసిన వారు ఎన్నిక కానున్నారు. నామినేష‌న్ల స‌మ‌యానికి కేవ‌లం ఐదు స్థానాల‌కు ఐదుగురు మాత్ర‌మే నామినేష‌న్ దాఖ‌లు చేశారు. నిజానికి మ‌రొక‌రు నామినేష‌న్ వేయాల‌ని అనుకున్నా..కూట‌మి నాయ‌కులు రంగంలోకి దిగి త‌ప్పించార‌న్న ప్ర‌చారం ఉంది.

అంతేకాదు.. స‌ద‌రు నాయ‌కుడి వివ‌రాలు కూడా బ‌య‌ట‌కు రాకుండా చాలా చాక‌చక్యంగా వ్య‌వ‌హ‌రించా రు. ఆయ‌న మాజీ మంత్రి, సీమ జిల్లాల‌కు చెందిన నాయ‌కుడు అని మాత్ర‌మే ప్ర‌చారంలో ఉంది. దీంతో మ‌రెవ‌రూ ఈ ఎన్నిక‌ల్లో పోటీ  చేయ‌లేదు. టీడీపీ నుంచి ముగ్గురు.. గ్రీష్మ‌, బీద ర‌విచంద్ర, బీటీలు మాత్ర‌మే నామినేష‌న్ వేయ‌గా, జ‌న‌సేన నుంచి అంద‌రిక‌న్నా ముందు నాగ‌బాబు స‌మ‌ర్పించారు. ఇక‌, బీజేపీ త‌ర‌ఫున సోము వీర్రాజు చివ‌రి నిముషంలో నామినేష‌న్ వేశారు.

దీంతో ఈ ఐదుగురు త‌ప్ప మ‌రొక‌రు నామినేష‌న్ వేసిన ప‌రిస్థితి లేదు. వాస్త‌వానికి వైసీపీ ఒక సీటుకైనా నామినేష‌న్ వేస్తుంద‌ని అనుకున్నారు. కానీ, చివ‌రి నిముషం దాకా ఊగిస‌లాడినా.. పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి మొగ్గు క‌నిపించ‌లేదు. దీంతో నాయ‌కులు ఉసూరు మంటూ త‌ప్పుకొన్నారు. ఇక‌, ఈ రోజు(13 వ‌తేదీ) సాయంత్రం 4 గంట‌ల‌కు ఏక‌గ్రీవాల‌ను ప్ర‌క‌టించ‌నున్నారు. దీంతో ఐదుగురు కూడా సాధ్య‌మైనంత త్వ‌ర‌లోనే ఈ స‌భ‌ల్లోనే ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు.

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న స‌భ‌లు ఈ నెల 21వ తేదీ వ‌ర‌కు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో శుక్ర‌వారం మం చి రోజు కావ‌డంతో ఆ వెంట‌నే వారి ప్ర‌మాణ స్వీకారం ఉంటుంద‌న్న ప్ర‌చారం ఉంది. దీంతో ఐదుగురు స‌భ‌లోకి అడుగు పెట్ట‌నున్నారు. ఈ ప‌రిణామం కూట‌మికి మ‌రింత బ‌లాన్ని చేకూర్చింద‌నే చెప్పాలి. స‌భ‌లో ఆ పార్టీల‌కు వాయిస్ పెర‌గ‌డంతోపాటు.. బ‌ల‌మైన మ‌ద్ద‌తు కూడా ల‌భించ‌నుంది. ఇది వైసీపీపై ఏమేర‌కు ప్ర‌భావం చూపిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: