
ఆ కులం మాదిగల కంటే వెనుకబడిందన్న మంద కృష్ణ మాదిగ?
రిజర్వేషన్ల ద్వారా ఎదిగిన అధికారులు అభివృద్ధికి దూరంగా ఉన్న... డక్కలి లాంటి కులాలకు చేయూత అందించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కోరారు. అభివృద్ధికి దూరంగా ఉన్న వారికి వర్గీకరణ ఫలాలు అందాలని ఆ దిశగా తన పోరాటం కొనసాగుతోందని.. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తెలిపారు. ఎస్సి వర్గీకరణలో న్యాయం చేయాలని కోరుతూ.. మిత అయ్యల్వర్ కులస్తుల సంఘం ఆధ్వర్యంలో... బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సదస్సులో మందకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
రాబోయే రోజుల్లో అట్టడుగులో ఉన్న వారిని ఆదుకునేందుకు... మాదిగ అధికారులు వారిని దత్తకు తీసుకొనేలా ముందుకు సాగుతామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. దళితుల ఆకాంక్షలు, వెనుకబాటు జనాభాకు అనుగుణంగా న్యాయం జరగాలన్నారు. ఉమ్మడి రిజర్వేషన్ల ద్వారా నష్టపోయిన వారు... వర్గీకరణ ద్వారా కూడా నష్టపోకూడదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు. జస్టిస్ శామీమ్ అక్తర్ నివేదిక శాస్త్రీయంగా లేదని మంద కృష్ణ మాదిగ అన్నారు.
కుల ధ్రువీకరణ పత్రాలు ఆర్డీవో ద్వారా తీసుకొనే క్రమంలో... ఇబ్బందులు ఎదురవడంతో కొంత మంది వేరే కులాల పత్రాలు తీసుకున్నారని మంద కృష్ణ మాదిగ వెల్లడించారు. వీరికి ఎమ్మార్వో ద్వారా కుల ధ్రువీకరణ లు ఇవ్వాలని మంద కృష్ణ మాదిగ కోరారు. గ్రూప్ 3లో ఉన్నవారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని... లోపాలను సీఎం, ఉప ముఖ్యమంత్రి కు వివరించమన్నారు. వీరి మనోభాలను దృష్టిలో పెట్టుకొని కమిషన్ సమయం కోరుతామని... వారి సమస్యలను దృష్టికి తీసుకెళ్తామని మంద కృష్ణ మాదిగ వెల్లడించారు.
గోదావరి పరివాహక ప్రాంతాలలో ఉన్న నేతకని, మహార్, గోసంగి కులాలు మాల సర్టిఫికెట్స్ తీసుకున్నారని... అవన్నీ వాస్తవ లెక్కలు తేలితే మాలలు జనాభా 10 లక్షలు కూడా దాటదని మంద కృష్ణ మాదిగ అన్నారు. లోపాలు ఉన్న నివేదికను ఆమోదించమని... మాదిగలతో పాటు, అన్యాయానికి గురైన వారి పక్షాన పోరాడుతామని మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు.