ఈ సారి కేసీఆర్ ని లోపల వేసేలా రేవంత్ పక్కా వ్యూహం..?
కేసీఆర్ విషయంలో ఏం జరగబోతోంది. భారాస హయాంలో విద్యుత్ ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. దీని పైన ఇప్పటికే జస్టిస్ లోకూర్ నివేదిక అందింది.తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. న్యాయ నిపుణుల పరిశీలనకు పంపించి, తదుపరి చర్యలకు ఉపక్రమించాలని నిర్ణయించింది. దీంతో.. త్వరలోనే కేసీఆర్ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.
విద్యుత్తు నిర్ణయాలపై విచారణ కమిషన్ వేయాలనే నిర్ణయం శాసన సభలో తీసుకున్నారు. దీంతో, ఇప్పుడు ఈ నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టాలా .. లేక, కేసు నమోదు చేయాలా అనే అంశం పైన చర్చ జరుగినట్లు తెలుస్తోంది.
కేసీఆర్ హయాంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా రాష్ట్రానికి నష్టం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. కాలంచెల్లిన టెక్నాలజీతో కట్టిన భద్రాద్రి పవర్ ప్లాంట్‌తో రానున్న 25 ఏళ్లకాలంలో రూ.9 వేల కోట్ల దాకా భారం పడుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అదే విధంగా చత్తీస్ ఘడ్ తో చేసుకున్న ఒప్పందం కారణంగా రూ 3,642 కోట్ల మేర నష్టం జరిగినట్లు గుర్తించారు. అదే విధంగా ఓపెన్ మార్కెట్ లో విద్యుత్ కొనుగోళ్ల కారణంగా రూ 2 వేల కోట్ల నష్టం జరిగిందని భావిస్తున్నారు. చత్తీస్ ఘడ్ కు సకాలంలో చెల్లింపులు చేయని కారణంగా లేట్‌పేమెంట్ కింద రూ.750 కోట్ల మేర చెల్లింపులు చేస్తున్నారని అధికారులు నివేదించారు.
చత్తీస్ ఘడ్ కరెంట్‌తో రూ.3385 కోట్ల మేర భారం పడిందని కమిషన్ ఇచ్చిన నివేదికపైనా మంత్రివర్గం చర్చించినట్లు తెలుస్తోంది. మరో వెయ్యి మెగావాట్ల కారిడార్‌ను రద్దు చేసుకున్నందు కు నష్టపరిహారం కింద రూ.261 కోట్లు చెల్లించాలని పవర్‌గ్రిడ్ నోటీసు ఇవ్వడం పైనా చర్చ జరిగినట్లు సమాచారం. అయితే, మంత్రివర్గ సమావేశంలో ఈ నివేదిక పైన ఎక్కువ సేపు చర్చ జరిగింది. మంత్రులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేసారు. అయితే, పూర్తిగా చర్చించిన తరువాత .. న్యాయ పరంగా సలహాలు తీసుకొని ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.