జగన్.. 4 లక్షల ఎకరాలకు ప్లాన్ వేశారా..? తవ్వుతున్న బాబు?
రెవెన్యూ సదస్సులలో అర్జీలు పై ఆడిట్ కూడా నిర్వహిస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. 12 జిల్లాల కలెక్టర్లు జేసీలు ప్రజాప్రతినిధులతో ప్రాంతీయ రెవెన్యూ సదస్సు నిర్వహించామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులో 32 రకాల ఫిర్యాదులకు సంబంధించి అర్జీలు వస్తున్నాయన్నారు. లక్షకు పైగా అర్జీలు ఆర్వో ఆర్ వరకు సంబంధించిన అంశాలపైనే ఉన్నాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. 7000 అర్జీలు రీ సర్వే వివాదాలపై వచ్చాయని మంత్రి తెలిపారు.
రెవెన్యూ సదస్సులోనే ఈ అర్జీలను సత్వరం పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. 22 ఏ లో 1 కోటి 88 లక్షల ఎకరాల అంశం పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ వివరించారు. రెవెన్యూ సదస్సులు జనవరి 8 తేదీన ముగుస్తాయని.. ఉత్తరాంధ్ర లో సంక్రాంతి పండుగ తర్వాత కూడా 5 రోజుల పాటు రెవెన్యూ సదస్సు లు నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.
జనవరి 20 తేదీ నుంచి రీసర్వే ప్రక్రియ మళ్ళీ మొదలు పెడతామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రోజుకు 20 ఎకరాల చొప్పున మాత్రమే బ్లాక్ వైస్ గా రీ సర్వే చేస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. ఫ్రీ హోల్డ్ భూముల రిజస్ట్రేషన్ లపై మంత్రుల కమిటీ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న మంత్రి అనగాని సత్యప్రసాద్.. దీనిపై రెవెన్యూ ఆర్థిక పురపాలక దేవాదాయ మైనారిటీ శాఖల మంత్రులతో కమిటీ ఏర్పడిందని వెల్లడించారు.