తొలిసారి పన్ను చెల్లింపు దారులకు ఉపశమనం కలిగించనున్న మోదీ..?

''ఏం కొన్నా.. ఏం తిన్నా పన్ను బాదుడు తప్ప.. ప్రజలకు నేరుగా మేలు చేసే ఒక్క పనీ చేయదు''.. మోదీ ప్రభుత్వంపై సాధారణ ప్రజల్లో ఉన్న బలమైన అభిప్రాయం ఇది. పెట్రోల్ ధరలు, గ్యాస్ బాదుడు, జీఎస్టీ, ఆదాయ పన్ను ఇలా ఒకటని కాదు చెప్పుకొంటూ పోతే ఎన్నో..? అవినీతి రహితం, దేశ భద్రత, రాజకీయాలు పక్కనపెడితే మోదీ సర్కారుపై సాధారణ ప్రజల్లో సంక్షేమం విషయంలో తీవ్ర విమర్శలున్నాయి.  మరీ ముఖ్యంగా మధ్య తరగతిలో.



ఏడాదికి 15 లక్షల రూపాయల వరకు సంపాదించే వ్యక్తులకు అధిక ఆదాయపు పన్ను ఉపశమనం కల్పించాలని కేంద్రం పరిశీలిస్తోంది.  2020 పన్ను విధానంలో వార్షిక ఆదాయం 3 లక్షల నుంచి 15 లక్షల రూపాయల వరకు ఉన్నవారికి 5శాత నుంచి 20%, అధిక ఆదాయం ఉన్నవారు 30% పన్ను ఎదుర్కొనాల్సి వచ్చేది. కాగా పన్ను చెల్లింపుదారులు రెండు వ్యవస్థలను ఎంచుకోవచ్చు, హౌసింగ్ రెంటల్స్, ఇన్సూరెన్స్‌ పై మినహాయింపులను అనుమతించే లెగసీ ప్లాన్, 2020లో ప్రవేశపెట్టిన కొత్తది తక్కువ రేట్లను అందిస్తుంది, కానీ పెద్ద మినహాయింపులను అనుమతించదు.


జూలైలో ప్రకటించిన ఆదాయపు పన్ను చట్టంలో మార్పులు చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఇది అమలులోకి వస్తుంది.  2024లో ప్రకటించిన వాటి ప్రకారం.. కొత్త పన్ను విధానంలో కొత్త ఆదాయపు  పన్ను స్లాబ్‌లు మార్చారు. తద్వారా 2024-25కి మరింత ఆదాయపు పన్ను ఆదా చేయడానికి పన్ను చెల్లింపుదారులను అనుమతిస్తుంది. ఏటా రూ.17,500 వరకు ఐటీని ఆదా చేస్తుంది.



కొత్త స్లాబ్‌లలో 0-3 లక్షల రూపాయలకు 0%, 3,00,001 నుంచి 7 లక్షలకు 5%, 7లక్షల 1 రూపాయి నుంచి-10 లక్షలకు 10%, 10 లక్షల ఒక రూపాయి నుంచి -15 లక్షలకు 15%, 12 లక్షల నుంచి 15 లక్షలకు 20%, 15 లక్షలు ఆపై ఎక్కువ ఆదాయం ఉంటే 30 శాతం పన్ను విధించనున్నారు.


కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి రూ.50 వేల నుంచి రూ.75 వేలకు పెంచనున్నారు. ఫ్యామిలీ పెన్షనర్లకు స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: