ఏపీలో నేరాల కట్టడి కోసం చంద్రబాబు మాస్టర్‌ప్లాన్?
ప్రస్తుతం ఉన్నవాటికంటే అధునాతన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించిన సీఎం చంద్రబాబు.. సీసీ కెమెరాల ద్వారా వచ్చే డేటాను రియల్ టైమ్ లో వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. పోలీసింగ్ అనేది ప్రభావవంతంగా ఉండాలని వెల్లడించిన సీఎం చంద్రబాబు..
ముఖ్యమైన ప్రాంతాల్లో ఫేస్ రికగ్నిషన్ కెమెరాలను కూడా పెట్టుకుని నేరస్థుల్ని గుర్తించాలని ఆదేశాలు ఇచ్చారు.
డ్రోన్ల ద్వారానూ ర్యాండమ్ గా తనిఖీలు నిర్వహించాలని సూచించిన చంద్రబాబు.. రహదారులపై కొన్ని హాట్ స్పాట్ లలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. వాటిని కూడా విశ్లేషించి ప్రమాదాలు జరక్కుండానూ చర్యలు తీసుకునేలా ఆ డేటా ఉపయోగించాలని.. కొన్ని కేసుల దర్యాప్తు విషయాలను బయటకు వెల్లడించటం ద్వారా ప్రజల్లోనూ అవగాహన పెంచాలని చంద్రబాబు సూచించారు.
సైబర్ క్రిమినల్స్ కు అడ్డుకట్ట వేయాలంటే పోలీసులూ కొత్త పరిజ్ఞానం ఉపయోగించాలన్న చంద్రబాబు.. సీసీ కెమెరాల ద్వారా రియల్ టైమ్ నేరాలు, ప్రమాదాల నియంత్రణ జరుగుతోంది. దాన్ని వినియోగించుకోవాలని సూచిస్తున్నానన్నారు. సైబర్ సెక్యూరిటీ విభాగం కూడా పటిష్టంగా ఉండాలని.. నేరస్తులు రాజకీయ ముసుగులో బెదిరింపులకు దిగుతున్నారని.. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న పరిస్థితి ఉందని చంద్రబాబు అన్నారు. బ్రహ్మకుమారీస్ లాంటి సంస్థలపై కూడా అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారన్న చంద్రబాబు
సామాజిక మాధ్యమాల నియంత్రణకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. మైక్రో పైనాన్స్ అంశం రాష్ట్రంలో చాలా ఇబ్బందులు పెట్టిందని చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు.