మోదీ హా మజాకా? మన జోలికి వస్తే శత్రు దేశాలకు చుక్కలే?
మన దేశ సాంకేతిక రంగ నిపుణులు 75% స్వదేశీ పరిజ్ఞానంతో నాగాస్త్ర -1 అనే డ్రోన్ రూపొందించారు. దీనిని ఆత్మాహుతి డ్రోన్ అని నామకరణం చేశారు.మహారాష్ట్రలోని నాగపూర్ ప్రాంతంలోని సోలార్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో దీనిని తయారు చేశారు. “480 నాగాస్త్ర-1 లోటరింగ్ వెపన్” అని దీన్ని పిలుస్తున్నారు. వైమానిక దాడుల సమయంలో నాగాస్త్ర డ్రోన్ లను భారత సైన్యం ఉపయోగించవచ్చు.
దీనిని ఆత్మహత్య డ్రోన్ అని పిలుస్తున్నారు. జిపిఎస్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. లక్ష్యాన్ని కచ్చితంగా నిర్దేశించుకుని ఇది దాడి చేస్తుంది. దీని బరువు 9 కిలోల వరకు ఉంటుంది. ఇది 45 మీటర్ల ఎత్తు వరకు ఎగురుతుంది. గంటసేపు గాలిలో చక్కర్లు కొడుతుంది. రాడార్లకు ఇది ఎంత మాత్రం దొరకదు. పైగా ప్రతి గాడులు కూడా చేస్తుంది. ఇది అత్యంత ఖచ్చితత్వంతో పని చేస్తుంది. ఈ డ్రోన్ ల ద్వారా అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ చేరింది.
అయితే వాటికంటే మన వద్ద ఉన్న నాగాస్త్ర డ్రోన్లు అత్యంత శక్తివంతమైనవని సైన్యం చెబుతోంది. టార్గెట్ ను ఐడెంటిఫై చేసినా.. లేకపోతే మిషన్ మధ్యలో క్యాన్సిల్ చేసినా.. డ్రోన్లను వెంటనే వెనక్కి రప్పించవచ్చని సైన్యం చెబుతోంది. పారాషూట్ సహాయంతో వీటిని సాఫ్ట్ గా ల్యాండ్ కూడా చేయవచ్చు.
నాగాస్త్ర -1 మాత్రమే కాకుండా భవిష్యత్ కాలంలో నాగాస్త్ర -2, నాగాస్త్ర -3 కూడా ఆవిష్కరిస్తామని సాంకేతిక రంగ నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తు కాలంలో శాస్త్ర సాంకేతిక రంగాలలో చోటు చేసుకునే మార్పులను దృష్టిలో పెట్టుకొని సాంకేతికంగా నిపుణులు వివరిస్తున్నారు. ఇవి మాత్రమే కాకుండా మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ – MALE డ్రోన్లను అభివృద్ధి చేస్తామని సాంకేతికంగా నిపుణులు చెబుతున్నారు. అయితే మేల్ డ్రోన్లు మూడు నుంచి తొమ్మిది వేల మీటర్ల ఎత్తువరకు ఎగురుతాయి.
సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని 97 మేల్ డ్రోన్లను తయారు చేయాలని రక్షణశాఖ భావిస్తోంది. “శత్రు దేశాలు అనుసరిస్తున్న దుర్మార్గమైన విధానాలను తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది. వాటికి గట్టి కౌంటర్ ఇవ్వాలంటే అధునాతన ఆయుధాలను సమకూర్చుకోవాల్సి ఉంది. అవసరాల పెరుగుతున్నాయి కాబట్టి.. కొత్త కొత్త సామగ్రిని కూడా అందుబాటులో ఉంచుకోవాలి. ఇందులో కొత్త కొత్త ప్రయోగాలను ప్రోత్సహించాలి. తక్కువ సైన్యం వినియోగంతో వీటిని రన్ చేయాలి. అప్పుడే ప్రాణనష్టం తక్కువగా జరుగుతుందని” రక్షణ శాఖ అధికారులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే సరిహద్దుల్లో ఉన్న చైనా, పాకిస్తాన్ దేశాల నుంచి ఎప్పటికైనా ముప్పు పొంచి ఉంటుంది కాబట్టి.. ముందస్తు జాగ్రత్తగా అత్యంత అధునాతన ఆయుధాలను భారీగానే సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.