బీజేపీ, బీఆర్ఎస్ పెద్ద స్కెచ్? సీఎం గా ఉత్తమ్ కుమార్ రెడ్డి..?
కాంగ్రెస్‌లోని ఓ వర్గం కూడా ఇందుకు మద్దతు తెలుపుతోంది. అధికార పార్టీకి సబంధించి ఏదో ఒకటి మాట్లాడితే.. దానిపై కాంగ్రెస్ వర్గమంతా ఏకమై ఎదురుదాడి చేయకపోతే.. ఏందో ఉందన్న సంకేతం వెళ్తుందన్న ఆలోచనతోనే ఈ ప్రచారం జరుగుతుందని సమాచారం. రేవంత్‌రెడ్డిని తప్పించాలని చూస్తున్న కాంగ్రెస్‌లోని ఓ వర్గం కూడా దీనికి వత్తాసు పలుకుతోంది. అయితే ఈ ప్రచారంతో రేవంత్‌రెడ్డి మరింత బలపడే అవకాశం కూడా ఉంది. అధిష్టానం వద్ద రేవంత్‌కు ఇప్పటికీ మంచి గుర్తింపు ఉంది.
ఆయన నిర్ణయాలను అధిష్టానం స్వాగతిస్తోంది. కానీ, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు పనిగట్టుకుని ముఖ్యమంత్రి మార్పు అంశాన్ని తెరపైకి తెచ్చి ప్రచారం చేయాలని చూస్తున్నారు. సీఎం మార్పుపై ప్రచారం చేస్తున్న పార్టీలు ఉత్తమ్ పేరును తెరపైకి తెచ్చాయి. అయితే దీంతో ఉత్తమ్ వర్గం తమకు కలిసి వస్తుందని, రేవంత్ వర్గానికి నష్టం కలుగుతుందని భావిస్తున్నారు. కానీ, ఈ ప్రచారంతో ఉత్తమ్‌కు గానీ, రేవంత్‌కు గానీ నష్టం ఉండదు. ఇక రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక ఆయనను దించడానికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ తీవ్రంగా ప్రయత్నించారు. వీరు ప్రత్యేక గ్రూపు కట్టారు. ఈ విషయం అధిష్టానం దృష్టిలో ఉంది. సీనియర్లు ఎంత ఒత్తిడి చేసినా పీసీసీ చీఫ్‌గా రేవంత్‌నే అధిష్టానం కొనసాగించింది. ఆయన అధిష్టానం నమ్మకాన్ని నిలబెట్టారు. కాంగ్రెస్‌ను తెలంగాణలో అధికారంలోకి తెచ్చారు. దీంతో అధిష్టానం రేవంత్‌రెడ్డిని మార్చే ఆలోచన చేసే అవకాశం లేదు. దీంతో సీఎం మార్పు ప్రచారంతో మరోసారి విపక్షాలు అభాసుపాలు కావడం ఖాయం అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.