జనసేన, టీడీపీ కలసి కొనసాగడం కష్టమేనా? కుమ్ములాటలు స్టార్ట్ అయ్యాయి గా?
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏకంగా.. నిప్పులు చెరిగారు. జనసేన నాయకులకు, సామాజిక పింఛన్లకు సంబంధం ఏంటి? అని ప్రశ్నించారు. ఇది తమ టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీ అని.. దీనిని తామే పంపిణీ చేసుకుంటామని.. `ఏనా.. డుకు` వస్తాడో చూస్తాం.. అంటూ నోరు చేసుకున్నారు. ఈ వ్యవహారం మరింత ముదిరి.. తిట్ల నుంచి కొట్టుకునే వరకు సాగింది. దీంతో పలు మండలాల్లో పింఛన్ల పంపిణీని పోలీసులు నిలిపివేశారు.
ఇక, విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో కూడా కూటమి నేతల మధ్య వార్ జోరుగా సాగుతోంది. జనసేన ఎమ్మెల్యే లోకం మాధవికి వ్యతిరేకంగా టీడీపీ నేతలు భేటీ అయ్యారు. టీడీపీ ఇన్ ఛార్జ్ కర్రోతు బంగార్రాజు ఆధ్వర్యంలో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. లోకం మాధవి ఒంటెత్తు పోకడలకు పోతున్నారని.. టీడీపీ నాయకులతో వివాదాలకు దిగుతున్నారన్నది బంగార్రాజు అనుచరులు చెబుతున్నారు.తాజాగా రెండు రోజుల కిందట.. నెల్లిమర్ల పంచాయతీ సమావేశంలో మాధవి .. బంగార్రాజును అవమా నించారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మాధవిని కట్టడి చేయాలని.. టీడీపీ కూడాప్రచారం చేస్తేనే ఆమె గెలుపు గుర్రం ఎక్కారని.. ఆమెకు సీటును త్యాగం చేశామని.. టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈవిషయాన్ని సీఎం చంద్రబాబుకు వివరించేందుకు నాయకులు రెడీ అయ్యారు. శనివారం చంద్రబాబు విజయనగరంలో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన దృష్టికి ఈ విషయం రానుంది. మరి ఆయన ఎలాంటి తీర్పు చెబుతారో చూడాలి.