ఇక స్టాలిన్ కి చూక్కలేనా? విజయ్ తో పొత్తు కోసం తహతహ లాడుతున్న అన్నా డీఎంకే !

ఒక్క బహిరంగ సభతో తమిళనాట సంచలనంగా మారిన విజయ్... పొత్తులకు డోర్లు తెరిచే ఉంటాయని సంకేతాలు ఇచ్చారు.  దీంతో ఆయనతో జత కడితే ఎలా ఉంటుందనే ఆలోచనలో అన్నా డీఎంకే ఉన్నట్టు తెలుస్తోంది.  ఈ నెల 6న కీలక సమావేశం నిర్వహించనుంది. దీని కోసం పార్టీకి చెందిన జిల్లా స్థాయి నేతలతో చర్చించనుంది.


అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళని స్వామి పేరుతో విడుదలైన ఆ ప్రకటనలో ఏముంది అంటే..."రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలు, జిల్లా కార్యదర్శులు ఈ నెల ఆరున జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరు కావాలి" అని ఓ సర్క్యులర్ను విడుదల చేశారు. బుధవారం ఉదయం పది గంటల నుంచి సమావే ప్రారంభకానుంది.


గత వారంలో మొదటి రాజకీయ బహిరంగ సభ పెట్టిన తమిళనాడు వెట్రి కజగం అధ్యక్షుడు విజయ్ సంచలనంగా మారారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై పరోక్షంగా విమర్శలు చేసిన విజయ్... గత కొంత కాలంగా పాలించిన అన్నాడీఎంకేను పల్లెత్తిమాట కూడా అనలేదు. అంతే కాకుండా మైండ్ సెట్ కలిసి ఎవరితోనైనా కలిసి పని చేసేందుకు సిద్ధమని కూడా ఓ స్టేట్మెంట్ ఇచ్చారు.


అన్నాడీఎంకేపై విజయ్‌ కు సాఫ్ట్ కార్నర్ ఉందన్న ఆలోచన రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  దీన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి అన్నాడీఎంకే ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ నాయకత్వం లేక ఇబ్బంది పడుతోంది. జయలలిత మరణం తర్వాత ఆ పార్టీని నడిపిచే దిక్కులేకుండా పోయారు. పార్టీని హస్తగతం చేసుకునేందుకు శశికళ, పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఇలా ముగ్గురూ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు అవకాశం వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు.


గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి కూటమిగా పోటీ చేసిన అన్నాడీఎంకేకు ఘోర పరాభవం తప్పలేదు. బీజేపీకి కూడా అనుకున్న సీట్లు రాలేదు. దీంతో ఈ రెండు పార్టీలు ప్రస్తుతానికి ఎవరికి వారుగానే ఉన్నాయి. అందుకే విజయ్ క్రేజ్ను వాడుకొని పార్టీ ఉనికి కాపాడుకోవాలని అన్నాడీఎంకే ప్రయత్నిస్తోంది. విజయ్తో కలిసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే విజయం సాధించే అవకాశం ఉందనే అభిప్రాయంతో ఉందా పార్టీ.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: