ఐరాస: ఇలా అయితే ప్రపంచం నాశనమే?

ఐక్య రాజ్య సమితి విషయంలో ఇప్పటికీ ఎన్నో విమర్శలున్నాయి. అది అమెరికా చెప్పినట్లు నడుచుకుంటుందనే ఆరోపణలు ఉన్నాయి. రెండు ప్రపంచ యుద్ధాలు మిగిల్చిన విధ్వంసంతో బుద్ధి తెచ్చుకొని మరో ప్రపంచ యుద్ధం రాకుండా చూసేందుకు .. ప్రపంచ వ్యాప్తంగా శాంతిని నెలకొల్పేందుకు 1945లో ఐక్య రాజ్య సమితి ఏర్పడింది.


193 దేశాల పూర్తి కాల సభ్య దేశాలుగా ఉండగా.. వాటికన్ సిటీ, స్టేట్ ఆఫ్ పాలస్తీనా ప్రస్తుతం యుద్ధం జరుగుతున్న గాజా కూడా ఇందులోదే) దేశాలు సభ్యత్వం లేకుండా కొనసాగుతున్నాయి. శక్తిమంతమైన భదత్రా మండలి సహా ఆరు విభాగాలున్న ఐక్య రాజ్య సమితి ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే..


రెండున్నరేళ్లుగా ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతోంది. వీటిలో రష్యా ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశం. అంటే వీటో పవర్ ఉన్న దేశం. భద్రతా మండలి శాశ్వత సభ్య దేశాల్లో ఒక దేశం వీటో చేస్తే ఆ తీర్మానం ఆమోదం పొందదు. కాగా.. అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ శాశ్వత సభ్య దేశాలు.  భారత్ కు 75 ఏళ్లు అవుతున్నా.. ఈ సభ్యత్వం రాలేదు.


కాగా ఈ ఐదు శాశ్వత దేశాల్లో చైనా తప్ప మిగతూ మూడు రష్యాను వ్యతిరేకించేవే. అంతేగాక ఉక్రెయిన్ కు ఆయుధాలు సాయం చేస్తున్నాయి. ఓ వైపు ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఎడ తెగకుండా సాగుతుంటే.. మరోవైపు ఏడాది నుంచి గాజా ఇజ్రాయెల్ యుద్ధం నడుస్తోంది. వాస్తవానికి గాజా అంటే పాలస్తీనాలో భాగమే. కానీ అది సొంత పాలకమండలిని ఏర్పాటు చేసుకుంది. అలా హమాస్ లకు అడ్డాగా మారింది.


మరోవైపు హెజ్బోల్లా అడ్డా లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. దీనికి ప్రతిగా ఇరాన్ ఇజ్రెయెల్ మీదకి దూకుతుంది. ఇరాన్ విషయంలో ఇజ్రాయెల్ స్పందన ఏమిటి అన్నది చూడాలి. ఏడుగురితో తాము యుద్ధం చేస్తున్నామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ తెలిపారు. ఇక ఇది ఒక ప్రాంతీయ యుద్ధమే.


మరి ఇంత జరుగుతుంటే ఐరాస ఏం చేస్తున్నది అర్థం కావడం లేదు. దీనిపై భారత విదేశాంగ మంత్రి జై శంకర్ స్పందిస్తూ.. ప్రపంచంలో రెండు యుద్ధాలు జరుగుతుంటే ఐరాస ప్రేక్షక పాత్రకే పరిమితం అయిందని విమర్శించారు. సంక్షోభాలను పరిష్కరించేందుకు అదేం చేయలేకపోతుందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఐరాసలో మార్పులు జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: