లడ్డూ వ్యవహారంలో.. చంద్రబాబు క్షమాపణలు చెబుతారా?

ప్రపంచానికి దేవుడు, కలియుగ దైవం అయిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మీద భక్తులకు ఎంతో ప్రీతిపాత్రం అయిన లడ్డూలు మీద ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి ఆయన మెడకే చుట్టుకుంటున్నాయా అన్న చర్చ సాగుతోంది. సాధారణంగా చూస్తే చంద్రబాబు ఎప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుతారు. అలాంటిది ఆయన గత నెల 18న ఎన్డీయే మీట్ లో మాట్లాడిన మాటలు ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టించాయి.


ఆ సమయంలో ఆయన తమ వంద రోజుల పాలన గురించి చెబతూ గత అయిదేళ్ల వైసీపీ పాలనలోని తప్పులను ఎత్తి చూపుతూ ప్రసంగా చేస్తున్నారు. అలా ఆయన ఎన్నో అంశాలను ప్రస్తావించారు. అందులో భాగంగా ఆఖరుకు శ్రీవారి లడ్డూ ప్రసాదంలోనూ కల్తీ జరిగింది అంటూ ఆరోపించారు.  అది ఫ్లోలో చేశారా లేక అదీ ఒక ఆరోపణలా చేశారా అన్నది పక్కన పెడితే అదే దవానలంగా మారింది.


మొదట అది వైసీపీని చుట్టుకొని అల్లకల్లోలం సృష్టించింది. అయితే వైసీపీ అనూహ్యంగా ఈ కేసు విషయంలో అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఎందుకు అంటే ఇది వైసీపీ అస్తిత్వానికే అతి పెద్ద మచ్చగా మారుతోంది. దాంతో వైసీపీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చకచకా పావులు కదిపింది.


నిజానికి చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు అవి అంతటి దుమారం సృష్టిస్తాయని అనుకోలేదు. అంతే కాదు వాటి మీద వైసీపీ వాయు వేగంతో రియాక్ట్ అయింది. ఈ ఇష్యూ ఏకంగా సుప్రీం కోర్టు వరకు వెళ్తుందని కూడా టీడీపీ ఊహించి ఉండదు. ఆధారాలు లేకండా ఎలా ఆరోపిస్తారు అని ఏకంగా ప్రభుత్వాన్నే ప్రశ్నించింది. అయితే మొన్నటి వరకు వైసీపీ మెడకు వేలాడిన కత్తి ఇప్పుడు టీడీపీ వైపుగా వచ్చింది.  దేవ దేవుడి లడ్డూ విషయంలో జరుగుతున్న ప్రచారం పట్ల భక్తులు అంతా మండి పడుతున్నారు. వారికి స్వాంతన చేకూర్చకపోతే మాత్రం ఎవరకీ అయిన ఇబ్బందే అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: