నిమజ్జనం వేళ రేవంత్ రికార్డు.? ఇప్పటి వరకు ఏ సీఎం చేయని పని చేసి చూపించారుగా!

హైదరాబాద్ మహా నగర నిమజ్జన కార్యక్రమం విజయవంతంగా పూర్తైంది. ప్రశాంత వాతావరణంలో ఎలాంటి తల నొప్పులు లేకుండా నిమజ్జనాన్ని అధికారులు.. పోలీసులు పూర్తి చేశారు. కత్తి మీద సాము లాంటి నిమజ్జనం టాస్క్ ప్రశాంతంగా పూర్తి అయ్యేలా చేయడంలో రేవంత్ సర్కారు పాత్ర ఉందని చెప్పాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. వినాయక నిమజ్జనం వేళలో స్వయంగా నిమజ్జనం జరిగే చోటుకి రావడం కొన్ని నిమజ్జనాల్ని ప్రత్యేకంగా పర్యవేక్షించడం లాంటివి చేపట్టారు సీఎం రేవంత్ రెడ్డి.


తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్లలో కానీ.. అంతకు ముందున్న ఉమ్మడి రాష్ట్రంలో కానీ మరే సీఎం కూడా రేవంత్ రెడ్డి మాదిరి వినాయక నిమజ్జనం జరిగే ప్రాంతాలకు స్వయంగా వచ్చి.. దగ్గరుండి పర్యవేక్షించడం లాంటివి చేయలేదన్నమాట వినిపిస్తోంది. ఇదో అరుదైన రికార్డు అని.. గతంలో మరే సీఎం చేయని పనిని సీఎం రేవంత్ రెడ్డి పలువురు హర్షిస్తున్నారు.  


తమది ప్రజా ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అనే పనిగా ప్రస్తావిస్తున్న సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్లే ఆయన మాటలు.. చేతలు ఉండటాన్ని హర్షిస్తున్నారు. ఇదిలా ఉంటే.. మంగళవారం ఉదయం మొదలైన వినాయక నిమజ్జనం బుధవారం వరకు కొనసాగే వీలుందని చెబుతున్నారు. ప్రత్యేకంగా 5 వేల మంది పారిశుద్ధ్య కార్మికులతో హుస్సేన్ సాగర్ చుట్టూ క్లీనింగ్ చేయడానికి జీహెచ్ఎంసీ రంగంలో దిగింది.


ఒక్క హుస్సేన్ సాగర్ చుట్టూ పక్కల మంగళవారం రాత్రి నాటికి 1.03లక్షల గణనాథులును నిమజ్జనం  చేసినట్లుగా చెబుతున్నారు. సాగర్ తర్వాత అత్యధికంగా మూసాపేట ఐడీఎల్ చెరవులో 26456 గణనాథుల్ని నిమజ్జనం చేస్తే.. అల్వాల్ కొత్త చెరువు వద్ద 6211  వినాయక విగ్రహాలను నిమజ్జనాలను పూర్తి చేసినట్లుగా అధికారులు చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్  మొత్తంలో 71 ప్రాంతాల్లో వినాయక నిమజ్జనాలను చేపట్టారు. మొత్తం మీద గతంలో ఏ సీఎం చేయని విధంగా రేవంత్ రెడ్డి చేయడాన్ని పలువరు అభినందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: