కాంగ్రెస్ లో ఆ పదవి కోసం కొట్లాట?

frame కాంగ్రెస్ లో ఆ పదవి కోసం కొట్లాట?

తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల గోల ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు అదే జరగుతుంది. ఒకప్పుడు పీసీసీ ఇస్తే ఇవ్వండి.. అంతే కానీ ప్రాధాన్యం లేని వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ అక్కర్లేదు అంటూ పెదవి విరిచిన నేతలే.. ఈ పదవి కోసం తెగ ఆరాట పడుతున్నారు. కారణం ఒక్కసారి ఆ పదవి చేపడితే తమ జాతకం మారిపోతుందని వారంత బలంగా నమ్ముతున్నారు.


కాంగ్రెస్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు రాష్ట్ర విభజన తర్వాత నేతలను సంతృప్తి పరిచేందుకు హైకమాండ్ కొత్తగా సృష్టించింది. మొదట పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ తర్వాత పీసీసీ అయి దిల్లీ పెద్దలకు చేరువ అయ్యారు. ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో కీలక మైన మంత్రిత్వశాఖలు నిర్వర్తిస్తున్నారు. ఉత్తమ్ అనంతరం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన భట్టి విక్రమార్క జాతకం కూడా మారిపోయింది.


ఏకంగా సీఎల్పీ నేతగా పనిచేశారు. అనంతరం డిప్యూటీ సీఎం హోదాలో రేవంత్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి కూడా మొదట పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంగ్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాతే పీసీసీ చీఫ్ అయ్యారు. రాష్ట్రం అంతా సుడిగాలి పర్యటన చేశారు. హైకమాండ్ కు దగ్గర అయి సీఎం పదవి అధిష్ఠించారు.


ఇక ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ కూడా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. ఈ పరిచయాలతోనే ఆయనకు మొదట ఎమ్మెల్సీ పదవి దక్కింది.  ఆ తర్వాత దిల్లీ, స్థానిక నేతల అండతో పెద్దగా పోటీ లేకుండా సులభంగా టీపీసీసీ చీఫ్ అయ్యారు. ఇలా కార్వనిర్వాహక అధ్యక్షులుగా పనిచేసిన నేతల జాతకం మారుతుండటంతో ఈ పోస్టు కోసం కాంగ్రెస్ సీనియర్లు ఈ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరొకొద్ది రోజుల్లో వర్కింగ్ ప్రెసిడెంట్ ను ప్రకటించనుండటంతో సీనియర్లు ఈ పదవి కోసం లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: