ఇప్పటికైనా చంద్రబాబు జన్మభూమి రుణం తీర్చుకుంటారా?

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తెలంగాణ ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని ప్రాజెక్టులకు నీటిని విడుదల చేస్తున్నా మన రాష్ట్రంలోని హంద్రీ-నవా ప్రాజెక్టు గురించి ఏపీ సర్కారు పట్టించుకోవడం లేదు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం కనీస స్థాయికి అంటే 854 అడుగులకు చేరింది. ఎగువ నుంచి ప్రాజెక్టు లోకి రెండు లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతోంది. కృష్ణా బోర్డు అనుమతి తీసుకోకుండానే ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ జెన్ కో విద్యుతుత్పత్తి చేస్తూ 31784 క్యూసెక్కులను ప్రాజెక్టు నుంచి తరలిస్తోంది.

జూన్ 3 నాటికి శ్రీశైలం ప్రాజెక్టులో 806.3 అడుగుల్లో 32.19 టీఎంసీల మాత్రమే నిల్వ ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా నీటి తరలింపు ప్రారంభించింది. కానీ ఇప్పటికీ హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోయడంపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం.

నైరుతి రుతు పవనాల వల్ల రాయలసీమలోని అధిక ప్రాంతాల్లో చెదురుముదురు వర్షాలే కురిశాయి.  హంద్రీ-నీవాలో అంతర్భాగం అయిన జలాశయాలు, కాలువకు ఇరు వైపులా ఉన్న చెరువులు నీళ్లు లేక నోరు తెరుచుకోలేదు. భూగర్భ జల మట్టం తగ్గిపోవడంతో తాను, సాగు నీటికి సీమ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా జూన్ 3 నుంచే తెలంగాణ సర్కారు నీటిని తరలిస్తున్నా ఏపీ ప్రభుత్వం హంద్రీ-నీవాకు నీటిని విడుదల చేయకపోవడంపై రైతులు మండిపడుతున్నారు.

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 120 రోజుల్లో 40 టీఎంసీలను తరలించి ఉమ్మడి కర్నూలు, అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు జిల్లాలో 6.02 లక్షల ఎకరాలకు సాగు నీరు 33 లక్షల మంది దాహార్తి తీర్చి.. రాయలసీమను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా  మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి రూ.6850 కోట్లతో హంద్రీ నీవా సుజల స్వంతి పథకాన్ని ప్రారంభించారు. 2009 నాటికే చాలా పనులు పూర్తి కావడంతో 2012-13 నుంచి హంద్రీ-నీవా ద్వారా రాయలసీమకు నీరు అందిస్తోంది. ఆ తర్వాత వైఎస్ జగన్ ఈ పనులను కొనసాగించారు. మరి ఇప్పుడు చంద్రబాబు వీటిని కొనసాగస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: