జగన్‌ సీఎంగా లేడుగా.. ఆ పేద పిల్లలపై కుట్ర జరుగుతోందా?

విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు మాజీ సీఎం జగన్ విశేషంగా కృషి చేశారు. ఇది ఎవరు అవును అన్నా.. కాదన్న ఒప్పుకొని తీరాల్సిన నిజం.  పాఠశాలలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. నాడు నేడు తో పాఠశాలల అభివృద్ధి, అమ్మ ఒడి పథకం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి డబ్బులు, ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం, జగనన్న కిట్లు వంటి అనేక పథకాలను విద్యార్థుల కోసం ప్రవేశ పెట్టారు.

పాఠశాలల్లో ఆధునిక వసతులతో విద్యను అందిస్తూ అక్షరాస్యతను పెంచేందుకు ప్రయత్నం చేశారు. ప్రస్తుతం డిజిటల్ బోధనకు ప్రాధాన్యం పెరిగింది. కరోనా తర్వాత డిజిటల్ పాఠాలు పెరిగిపోయాయి. అయితే వీటి కోసం సొంతంగా ట్యాబ్ లను సమకూర్చుకోవడం విద్యార్థులకు సాధ్యం అయ్యే పని కాదు. ఈ క్రమంలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు జగన్ బైజూస్ కంటెంట్ తో కూడిన ట్యాబ్ లను వారికి ఉచితంగా అందజేశారు.

ఈ ఉచిత ట్యాబ్ విధానం వల్ల ఎంతో మంది పేద విద్యార్థులు ప్రయోజనం పొందారు. ఇంత వరకు బాగానే ఉన్నా… దీనిపై కొందరు పని కట్టుకొని దుష్ప్రచారం మొదలు పెట్టారు. అప్పట్లో టీడీపీ నేతలు దీనిని విమర్శించింది. ఇప్పుడు తాజాగా బైజూస్ కంటెంట్ తో కూడిన ట్యాబ్ ల వల్ల విద్యార్థులకు మేలు జరగకపోగా.. చెడు మార్గంలో పయనిస్తున్నారని ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది.

విద్యార్థుల్లో చాలా మంది ఇతరత్రా కార్యక్రమాలకు వీటిని వినియోగిస్తున్నారని… కొత్త ప్రభుత్వం ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్ లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిలిపివేయాలని ఆ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఏ. గణపతిరావు, కే. ప్రకాశ్ రావు లు విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు రాత్రి వేళలో ఎక్కువగా ట్యాబ్ లను వినియోగించడం మూలంగా వారి మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని విద్యార్థుల తల్లిదండ్రులు టీచర్లకు ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. అయితే దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అందరి ఇళ్లలో ఒకటికి మించి ఫోన్లు ఉన్నాయని.. ఇవి లేకపోతే వాటిని ఉపయోగించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. పేదలకు ఉపయోగపడే పథకంపై బురదజల్లడం ఆపాలని పలువురు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: