అరవింద్ కేజ్రీవాల్.. జైల్లోనే అంతమైపోతారా?

రాజకీయ నాయకుల బరువు సైతం వార్తాంశంగా మారి వివాదం సృష్టిస్తోంది. దిల్లీ సీఎం, ఆప్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఇదే జరుగుతుంది. దిల్లీ మద్యం పాలసీ అక్రమాల విషయంలో అరెస్టు అయి ప్రస్తుతం దిల్లీలోని తిహాడ్ జైలులో ఉన్నారు. అయితే ఆయన బరువు తగ్గారంటూ ఆ పార్టీ ముఖ్య నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 8.5 కేజీలు బరువు తగ్గారని, జైలులో పరిస్థితులు ఏ మాత్రం బాగా లేవని, అందుకే ఆందోళన కర రీతిలో బరువు తగ్గారని ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలను తిహాడ్ జైలు అధికారులు ఖండిస్తూ కేంద్ర హోం శాఖకు లేఖ రాశారు.

ఆప్ నేతలు ఆరోపించిన మాదిరి కేజ్రీవాల్ బరువు తగ్గలేదని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. అసలు కేజ్రీవాల్ ఎంత బరువున్నారు. ప్రస్తుతం ఎంత ఉన్నారు వంటి విషయాలను లెక్క పత్రాలతో సహా నివేదించారు. జైలు అధికారుల నివేదిక ప్రకారం ఏప్రిల్ 1, 2024న మొదటి సారి కేజ్రీవాల్ తిహాడ్ జైలుకి వచ్చిన సమయంలో 65 కేజీలు బరువు ఉన్నారు. మధ్యంతర బెయిల్ పై విడుదల అయిన బయటకొచ్చినప్పుడు 64 కేజీలున్నారు. జూన్ 2న 63.5 కేజీలు ఉన్నారు. మొదటి సారి చేరినప్పటి నుంచి చూస్తే దాదాపు 3.5 కేజీలు మాత్రమే బరువు తగ్గారు. ఇదంతా కూడా ఆయన జైలులో మితంగా తినడం వల్లే అని జైలు సూపరింటిండెంట్ పేర్కొన్నారు.

లిక్కర్ కుంభకోణంలో ఈడీ దర్యాప్తు చేస్తున్న కేసులో కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇక సీబీఐ కేసులోనూ బెయిల్ వస్తే ఆయనకు జైలు నుంచి విముక్తి లభిస్తుంది. ఆరోగ్య కారణాలతోనే బెయిల్ పొందడం కోసమే ఆప్ నేతలు ఇలాంటి ప్రచారాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఎంత కాదన్నా ఆయన ఒక రాష్ట్రానికి సీఎం అని.. ఆయన ఆరోగ్య విషయం, బరవు వంటి వాటిని బహిరంగ పరచాలని పలువురు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: