తప్పు జరిగినా.. క్రెడిట్‌ కొట్టేయడం బాబు స్పెషల్‌?

పాలనాపరమైన అంశాల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం చేయాలి. ఏం చేయకూడదన్న విషయాన్ని ఆయనకు చెప్పాల్సిన పనిలేదు. పాలనాపరమైన అనుభవం ఆయనకు చాలా ఎక్కువ.  నిజానికి.. ప్రజా పాలకుడిగా కంటే కూడా అత్యుత్తమ కార్య నిర్వాహకుడిగా ఆయనకు పేరుంది. గతంలో ఆయన తనను తాను సీఎం అనిపించుకునే కంటే ఏపీకి సీఈవో అనిపించుకోవడానికే ఆసక్తి చూపేవారు.

ఎప్పుడైతే దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి ప్రజా పాలకుడిగా పేరు తెచ్చుకున్నారో అప్పటి నుంచి చంద్రబాబు సీఈవో ఇమేజ్ నుంచి ప్రజా పాలకుడి ముద్ర కోసం ఆరాట పడ్డారు. పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత 2014లో చంద్రబాబు ప్రజా పాలకుడి అనే ఇమేజ్ కోసం ప్రయత్నించారు. ఇవన్నీ పక్కన పెడితే.. పాలనాపరంగా చంద్రబాబు వ్యూహాలు ఒక రేంజ్ లో ఉంటాయి. ఎవరికీ అర్థం కావు. తాను ఏం చేయదలచుకున్నారో జనాల్లో ఒక ట్రయిల్ వేయడం ప్రారంభించారు. 2014కి ముందు అయితే తాను అనుకున్నది నేరుగా చేసిన చంద్రబాబు తన పంథాను మార్చి అడుగులు వేస్తున్నారు.

ముందుగా తన అనుకూల మీడియాలో చెప్పించడం, పేపర్ లో రాయించడం వంటివి చేసి ప్రజల్లో, ప్రత్యర్థి పార్టీల్లో విమర్శలు రాకపోతే వాటిని కొనసాగిస్తారు. లేకపోతే మేం అలా అనలేదు. ఇంకా మార్గదర్శకాలు రూపొందించలేదు అంటూ వాటిని దాటవేసే ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది చంద్రబాబు అనుసరిస్తున్న వ్యూహం.  

తాజాగా చూసుకుంటే అమ్మ ఒడి పథకం కింద ప్రతి తల్లికి రూ.15 వేలు ఇస్తామని ఎన్నికల సమయంలో చెప్పారు. కానీ దీనికి ఆధార్ లింక్, హాజరు ఇలా నిబంధనలు పెట్టారనే వార్తలు వచ్చాయి. ప్రభుత్వ పెద్దలు చెప్పకుండా ఈ అంశాలు బయటకు ఎలా వస్తాయి. దీనిపై వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గారు. అలాగే వాలంటీర్ వ్యవస్థ దీనిని ఉంచారో.. కొత్తవారిని తీసుకున్నారో చెప్పడం లేదు. దీనిపై వ్యూహాత్మక మౌనం పాటిస్తుంటారు. ఇక జీపీఎస్ కు చంద్రబాబు ఓకే చెప్పారు అనే వార్తలు వస్తున్నాయి. దీనిపై ఉద్యోగుల నుంచి వ్యతిరేకత రాకపోతే ఓకే. వస్తే మాత్రం దీనిని తప్పించి వేరే దాని గురించి ఆలోచిస్తారు. ఆయనే సమస్యను సృష్టించి.. దానిని పరిష్కరించి ప్రజల్లో మార్కులు కొట్టేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: