జగన్‌ అసెంబ్లీలో తొలి వ్యూహమే.. బ్లండర్‌ మిస్టేక్‌?

ఏపీ అసెంబ్లీలో సభ్యుడిగా నిన్న ప్రమాణం స్వీకారం చేసిన జగన్.. ఆ తర్వాత మూడు రోజులు సభ జరుగుతుందని తెలిసినా గైర్హాజరు అయ్యారు. పులివెందులలో వ్యక్తిగత పని ఉందంటూ పర్యటన పెట్టుకున్నారు. ఆయన గైర్హాజరు కావడమే కాదు.. ఏకంగా మిగిలిన పది మంది సభ్యులు కూడా హాజరుకారాదని నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ ఎన్నికను బహిష్కరించారు. ఈ నిర్ణయాలన్నీ ఆయన్ను ప్రజల్లో మరింత పలుచన చేస్తాయని గ్రహించాలి.

అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్న పాత్రుడు ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికైన సందర్భంగా అధికార, విపక్షాలు సభలో ఉండటం సాంప్రదాయం. జగన్ దాన్ని తుంగలో తొక్కారు. స్పీకర్ ఎన్నికకు జగన్ గైర్హాజరవటం బీసీలను అవమానించటమే అన్న వాదన కూడా వినిపిస్తోంది. జగన్ కు వ్యక్తిగత పని ఉంటే, మిగిలిన సభ్యులు గైర్హాజరను ఎలా చూడాలన్న ప్రశ్నలు వస్తున్నాయి. ప్రజలు ఇంత బుద్ధి చెప్పినా ఇంకా అహంకారం దిగలేదు అనుకోవాలా అని కొందరు విమర్శిస్తున్నారు.

అంతే కాదు.. స్పీకర్ ఎన్నిక సందర్భంగా విపక్షం రాని సభను కూడా ఇప్పుడే చూస్తున్నామన్నది కొందరు సభ్యుల వాదన. ప్రతిపక్ష హోదా లేని జగన్ కారు అసెంబ్లీ లోనికి రానిచ్చాం, ప్రతిపక్ష హోదా లేకపోయినా మంత్రుల తర్వాత ఎమ్మెల్యే గా ప్రమాణం చేయించామని.. ఇచ్చే గౌరవాన్ని కూడా కాపాడుకోమ్ అంటే ఎలా  అని టీడీపీ నేతలు అంటున్నారు. మేం ప్రతిపక్షంలో ఉండగా ఎన్నో అవసమానాలు ఎదుర్కొన్నా..., సభా సంప్రదాయాలు పాటించామని వారు గుర్తు చేస్తున్నారు.

లేని హోదా కోరుకుంటూ సభను ఎగ్గొట్టేందుకు వైసీపీ సాకులు వెతుక్కుంటోందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ప్రజా తీర్పు గౌరవించే ధైర్యం కూడా జగన్ చేయట్లేదు. పరిటాల రవి హత్య జరిగిన వెంటనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైతే.. తమలో ఎంతో ఆవేశం ఉన్నా ప్రజా స్వామ్య పద్ధతిలోనే పోరాటం చేసి వ్యవస్థలను గౌరవించామని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. జగన్ అధికారం లో ఉండగా వ్యవస్థల్ని నాశనం చేశాడు, అధికారం పోయాక సంప్రదాయాలు కూడా పాటించట్లేదని విమర్శిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: