బాబుకు బిగ్‌షాక్‌ ఇచ్చేందుకు ప్లాన్‌ రెడీ చేసిన జగన్‌?

టీడీపీ అధినేత చంద్రబాబు విశేష అనుభవం ఉన్న రాజకీయ నేత. రాజకీయాల్లో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. వాటి నుంచి వెంటనే గుణపాఠం నేర్చుకునే వారు కొందరే ఉంటారు.  అయితే చంద్రబాబు రాజకీయాల్లో నిత్య విద్యార్థి అనే చెప్పవచ్చు. ఆయన ఏ మాత్రం భేషజాలకు పోరు. ఎలాంటి పరిస్థితులను అయినా తన దారికి తెచ్చుకోగల నేత.

ఏపీలో వైసీపీకి ప్రతికూల ఫలితాలు రావడంతో ఆ పార్టీ అధినేత దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ పార్టీ ఎందుకు ఓడిపోయిందో అర్థం కాక తల పట్టుకుంటున్నారు. ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా 11 స్థానాలే రావడంతో ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితిలో ఉన్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా వైసీపీ అధినేత ఆ పార్టీ ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు.

శాసనమండలిలో వైసీపీకి 39 మంది సభ్యుల బలం ఉంది. త్వరలో ఏపీ అసెంబ్లీ జరిగే అవకాశం ఉంది. శాసన సభలో టీడీపీ పెట్టే బిల్లులను అడ్డుకునేందుకు వైసీపీకి మండలిలో ఒక అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఎమ్మెల్సీలకు కీలక సూచనలు చేశారు. ప్రభుత్వ నిర్ణయాలను గట్టిగా ప్రతిఘటించాలని కోరారు.

గతంలో టీడీపీ కూడా అప్పటి ప్రభుత్వం వైసీపీ పెట్టిన బిల్లులను చాలా రోజుల  వరకు ఆపింది. దీంతో అప్పటి సీఎం జగన్ శాసన మండలిని రద్దు చేద్దామని తలచారు. కానీ రాష్ట్రపతి, ప్రధాని వద్ద ఈ నిర్ణయం పెండింగ్ పడటంతో దాని వైపు అడుగులు వేయలేదు. ఆ తర్వాత క్రమంగా మండలిలో వైసీపీ బలం పెరుగుతూ వచ్చింది.

ఇప్పుడు ఒకవేళ బిల్లులను వైసీపీ మండలిలో అడ్డుకుంటే వాటిని రద్దు చేస్తారా అనే ప్రశ్న ఇప్పుడు అందరిలో తలెత్తుతోంది. పైగా చంద్రబాబు కి ఇప్పుడు కేంద్రం మద్దతు గట్టిగా ఉంది. పైగా ఆ పార్టీకి తగిన సభ్యులు కూడా లేరు. ఒకవేళ మండలిని రద్దు చేస్తే వైసీపీలో రాజకీయ నిరుద్యోగం గణనీయంగా పెరుగుతుంది. దీంతో ఆ పార్టీ కకలావికలం అవుతుంది.  ఎందుకంటే పదవి లేకుండా ఏ నేత ఉండలేరు. మరి ఆ అవకాశాన్ని జగన్ కల్పిస్తారా లేదా అనేది మరి కొద్ది రోజుల్లో తేలనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: