మోదీ కేబినెట్‌లో ఏ కులం మంత్రులు ఎందరో తెలుసా?

భారత దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ 09.06.2024 సాయంత్రం ఏడు గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. ఇది ఒక రికార్డ్. అంతకు ముందు జవహర్ లాల్ నెహ్రూ ప్రధానిగా మూడు సార్లు ఎన్నికయిన రికార్డును మోదీ సమం చేశారు.  అయితే ఇంటా బయటా శత్రువులను ఎదుర్కొని మూడో సారి ప్రధాని పదవీ బాధ్యతలు చేపట్టడం మోదీకే చెల్లింది.

మోదీ 3.0 క్యాబినెట్ లో మొత్తం 70 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.  ఇందులో కాబినెట్ మంత్రులు 30 మంది, మినిస్టర్ ఆఫ్ స్టేట్ స్వంతత్ర మంత్రులుగా ఐదుగురు, మినిస్టర్ ఆఫ్ స్టేట్ గా 36 మంది ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 24 రాష్ట్రాల నాయకులు మోదీ క్యాబినెట్లో భాగస్వాములయ్యారు.

వర్గాల వారీగా చూసుకుంటే ఓబీసీలు 27 మంది, ఎస్సీలు 10 మంది, ఎస్టీలు ఐదుగురు, మైనార్టీలు ఐదుగురు ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు. ఇక ముఖ్య రాష్ట్రాలు చూసుకుంటే గుజరాత్ నుంచి అమిత్ షా, జై శంకర్, మన్ సుఖ్ మాండవీయ, సీఆర్ పాటిల్, నిముబెన్ బాంబానియాలు, కర్ణాటక నుంచి నిర్మలా సీతారామన్, కుమార స్వామి, ప్రహ్లాద్ జోషి, శోబా కరంద్లాజేలు, మహా రాష్ట్ర నుంచి సోమన్న, పియూష్ గోయల్, నితిన్ గడ్కరీ, ప్రతాప్ రావ్ జాదవ్, రక్షా ఖడ్సే, రామ్ దాస్ అథవాలే, మురళీధర్ మోహోల్ లు ఉన్నారు.

మధ్యప్రదేశ్ విషయానికొస్తే.. శివరాజ్ సింగ్ చౌహాన్, జ్యోతిరాదిత్య సింధియా, సావిత్రి ఠాకూర్ , వీరేంద్ర కుమార్, దుర్గదాస్, కీలకమైన యూపీ నుంచి రాజ్ నాథ్ సింగ్, జితిన్ ప్రసాద, హరిదీప్ సింగ్ పురీ, జయంత్ చౌదురి, పంకజ్ అద్వానీ, బీఎల్ వర్మ, అనుప్రియ పటేల్, కమలేశ్ పాశ్వాన్, బిహార్ నుంచి కీర్తి వర్దన్, చిరాక్ పాశ్వాన్, గిరిరాజ్ సింగ్ జితిన్ రామ్ మాంజీ, రామ్ నాథ్ ఠాకూర్, లాలన్ సింగ్, నిత్యానందర్ రాయ్, రాజ్ భూషణ్ చౌదురి, సతీశ్ దూబేలు ఉన్నారు. ఇక తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు ఉండగా.. ఏపీ నుంచి కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస వర్మలు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: