మేనిఫెస్టో మేజిక్‌: జగన్‌లా.. చంద్రబాబు చేయగలడా?

ఏపీలో ఈ సారి ఎన్నికలు వైసీపీ వర్సెస్ టీడీపీ, జనసేన, బీజేపీ గా జరగనున్నాయి. అయితే ప్రధాన పోటీ మాత్రం చంద్రబాబు, జగన్ మధ్యే అని చెప్పవచ్చు. అభ్యర్థుల జాబితా, ప్రచార పర్వంలో సీఎం జగన్ కూటమి పార్టీల కంటే ముందున్నారు. సిట్టింగ్ లకు స్థాన చలనం, పలువురికి సీట్లు నిరాకరణతో పాటు జనరల్ స్థానాల్లో బీసీలకు కేటాయిస్తూ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.

దీంతో ప్రస్తుతం వైసీపీలో అసంతృప్తి జ్వాలలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో కూటమిలో ఇంకా సీట్ల సిగపట్లు వీడటం లేదు. సీటు రాని అభ్యర్థులు పార్టీలు మారడం, రెబల్ గా బరిలో దిగేందుకు యత్నించడం వంటివి జరుగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా… ఎన్నికల్లో గెలవాలంటే ముందు అన్ని వర్గాల ఓటర్లను సంక్షేమ పథకాలతో ఆకట్టుకోవాలి. దీని కోసం ఆయా పార్టీలు మ్యానిఫెస్టోలు విడుదల చేస్తుంటాయి.

ఈ విషయంలో టీడీపీ సూపర్ సిక్స్ హామీలతో మినీ మ్యానిఫెస్టోని విడుదల చేసి అధికార వైసీపీ కన్నా ముందే ఉంది. ఇక్కడే సీఎం జగన్ సరికొత్త అంశాన్ని ఎత్తుకున్నారు. గడిచిన ఐదేళ్లలో మా ప్రభుత్వం వల్ల మీకు మంచి జరిగితేనే వైసీపీకి ఓటు వేయండి. లేకపోతే వద్దు అంటూ ధైర్యంగా ఓట్లు అభ్యర్థిస్తున్నారు. తాము ఎన్నికల ముందు ప్రకటించిన మ్యానిఫెస్టోని 90 శాతం అమలు చేశామని గర్వంగా చెబుతున్నారు.

2014లో టీడీపీ కూటమి అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీల జాబితాను చదువుతూ.. ఇందులో ఏయేం పూర్తి కాలేదో చెబుతూ ఆ  పార్టీల విశ్వసనీయతను ప్రజలకు వివరిస్తున్నారు.  ఈ కూటమి ఇచ్చిన హామీలు అమలు అయ్యాయా అని వారిని ప్రశ్నిస్తున్నారు. దీనికి కౌంటర్ గా టీడీపీ 2019 వైసీపీ మ్యానిఫెస్టోని తీసుకొని ఏవేం పథకాలు అమలు కాలేదో విమర్శించే సాహసం చేయలేకపోతుంది. ఒకవేళ వైసీపీ అమలు చేయని హామీలు ఉంటే వాటిని గుర్తించి జగన్ లా ప్రజల ముందు పెడితే ఆ కూటమికి ఆదరణ పెరిగుతుంది. లేకపోతే ఇవే అంశాలు ప్రతికూలంగా మారే అవకాశాలు లేకపోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: