వాలంటీర్లు: జగన్‌కి జై అంటున్న చంద్రబాబు?

ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్లను చూసి విపక్షాలు ఓ రకంగా భయపడుతున్నాయనే చెప్పాలి. వారిని మంచి చేసుకునేందుకు అనేక రకాలైన ప్రయత్నాలు చేస్తున్నారు. గత నాలుగేళ్లుగా వాలంటీర్ వ్యవస్థ బలంగా క్షేత్రస్థాయిలో పాతుకుపోయింది. దాదాపు రెండున్నర లక్షల మంది వాలంటీర్లు ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ పథకాలను అందజేయడమే కాకుండా వారికి దక్కాల్సిన పత్రాలతో పాటు ధ్రుపత్రాలు ఇంటికి తెచ్చి మరీ అందజేస్తున్నారు.

దీంతో జనానికి వారు బాగా కనెక్ట్ అయిపోయారు. ఎందుకంటే తమ పనులు కావాలంటే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు. ఈ భావన ఎక్కువగా పల్లెల్లో ఎక్కువగా వినపిస్తోంది. అయితే ఈ వ్యవస్థను సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకురావడంతో ఎన్నికల వేళ వాలంటీర్లు ఆ పార్టీకి ఉపయోగపడతారనే భావన విపక్షాల్లో ముఖ్యంగా చంద్రబాబు మదిలో ఉంది.

అందుకు అనుగుణంగా ఆది నుంచి వాలంటీర్లపై పలు సందర్భాల్లో చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యవస్థ ప్రజల్లోకి బలంగా వెళ్లింది. దీనిపై పొరుగు రాష్ట్రాల ప్రతినిధులు సైతం వచ్చి అధ్యయనం చేసి వెళ్లారు. అంతెందుకు తెలంగాణలో అధికారంలోకి వస్తే సీఎం రేవంత్ రెడ్డి సైతం వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వ్యవస్థను తొలగిస్తామంటే మొదటికే మోసం వస్తుందని భావించిన చంద్రబాబు ఇప్పుడు దీనిని తొలగించమని పదే పదే చెబుతున్నారు.

తాజాగా మరో అడుగు ముందుకు వేసి ప్రతి వాలంటీర్ నెలకు రూ.50వేలు సంపాదించుకునేలా తాను అధికారంలోకి వస్తే చేస్తానని చెబుతున్నారు. ఇలా చెప్పిన రెండు రోజులకే ఈసీకి లేఖ రాయించి వారిని విధుల నుంచి దూరంగా ఉంచారు. అసలే ఎండాకాలం. పింఛన్ల కోసం వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఎదురు చూస్తుంటారు. రేపటి నుంచి వారు ఎండలో నిలబడుతూ పింఛన్ డబ్బులను తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో టీడీపీపై ప్రజల్లో ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. మరోవైపు వాలంటీర్లు కూడా తమను విధులకు దూరంగా ఉంచారనే భావనలో ఉంటారు. మరి ఇది ఎన్నికల్లో ఏ మేర ప్రభావం చూపుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: