బీఆర్‌ఎస్‌ క్లోజ్‌: భారీగా పుంజుకోనున్న బీజేపీ?

లోక్ సభ ఎన్నికల ముంగిట నేతల రాజీనామాతో బీఆర్ఎస్ ఖాళీ అవుతోంది. తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టింది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో రెండెంకల స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది.  ఈ క్రమంలో పార్టీని బలోపేతం చేసేందుకు ఇతర పార్టీ నాయకులకు కాషాయ తీర్థం అందిస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు , మంత్రులు వరుసగా బీజేపీ గూటికి చేరుతున్నారు.

ఇప్పటికే తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించి జోష్ మీద ఉన్న బీజేపీ మిగిలిన స్థానాల్లో బలమైన నాయకులు కోసం వెతుకులాట ప్రారభించింది. అందుకోసం ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో బీఆర్ఎస్ నేతలకు వల వేసింది. బీజేపీ స్టైల్ లో జరిగిన చేరికలను గమనిస్తే రాష్ట్రంలో బీఆర్ఎస్ లక్ష్యంగా చేసుకొని వెళ్తోంది. పక్కా ప్రణాళికతో బీఆర్ఎస్ తో ఒరిగేది ఏమీ లేదని ప్రచారం చేస్తూ.. కేంద్రంలో తమ విజయ అవకాశాలను ఎరగా చూపి నేతలను పార్టీలోకి చేర్చుకుంటుంది.

బీజేపీ వ్యూహంతో బీఆర్ఎస్ ఖాళీ అవుతుంటే.. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ కు కఠిన సవాల్ ఎదురవుతాయి అనే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో డబుల్ డిజిట్ లక్ష్యంగా అడుగులు వేస్తూ.. మిగిలిన పార్టీలకు ట్రబుల్ క్రియేట్ చేస్తోంది. తమకు బలమైన అభ్యర్థులు లేరు అని భావించిన చోట బీఆర్ఎస్ మాజీలకు గాలం వేస్తోంది. ఇదే క్రమంలో రాష్ట్రంలో అధికారం కోల్పోయిన గులాబీ నేతలు పక్క చూపులు చూస్తున్నారు.

ఈ క్రమంలో సిట్టింగ్ ఎంపీలు బీబీ పాటిల్, రాములు కాషాయ కండువా కప్పుకోవడం వారికి  సీట్లు కేటాయించడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు మహబూబాబాద్, నల్గొండ, వరంగల్, ఖమ్మం, పెద్దపల్లి లో సరైన అభ్యర్థుల కోసం చూస్తున్న తరుణంలో జలగం వెంకట్రావ్, సైదిరెడ్డి, సీతారాం నాయక్, శ్రీనివాస్ లను పార్టీలో జాయిన్ చేసుకున్నారు. మరోవైపు వలసలు కొనసాగుతాయి అనే సంకేతాలను సైతం బీజేపీ నేతలు ఇస్తున్నారు. ముందుగా అభ్యర్థులు ప్రకటనతో పాటు.. చేరికలతో తెలంగాణ కాషాయ దళం జోరుమీదుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: