ఒక్కసారిగా డైలమాలో పడిన జన సైనికులు?

ఏపీలో పొత్తుల వ్యవహారం కొలిక్కితేవడంలో పవన్ విజయవంతం అయ్యారు. టీడీపీని బీజేపీతో కలపడం వెనుక పవన్ కృషి ఎంతో ఉంది. ఇదే విషయాన్ని ఆయన చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. బీజేజీ అగ్ర నేతల వద్ద తనకు పరపతి ఉందని.. ఆయన పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు కూడా. ఇంత వరకు బాగానే ఉన్నా.. కేవలం జగన్ గద్దె దించడం పవన్ లక్ష్యమా.. లేక సీఎం అవ్వడమా అనేది జనసైనికులకు సైతం అంతుబట్టడం లేదు.

2019 ఎన్నికల్లో ఓటమి అనంతరం పవన్ ఎక్కడ యాత్ర లు చేపట్టినా సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేసిన పవన్ అభిమానులు గత ఆరు నెలల నుంచి సైలెంట్ అయిపోయారు. ఆ నినాదాన్ని పక్కన పెట్టారు. తమ అధినేత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తారు అని ప్రస్తుతం చెప్పుకుంటూ ఉంటున్నారు. మూడో వంతు సీట్లు అడుగుతారు. పవర్ షేరింగ్ వస్తుంది. కనీసం ఏడాదిన్నర అయినా సీఎంగా ఉంటారు. అని వారంతా ఆశించారు.

కానీ.. ఎప్పుడైతే చంద్రబాబు 24 సీట్లు జనసేనకు కేటాయిస్తున్నామని ప్రకటించారో అప్పటి నుంచి జనసైనికుల్లో తీవ్ర నైరాశ్యం, నిరాసక్తత అలముకుంది.  కేటాయించిన సీట్లలో కూడా టీడీపీ నుంచి వచ్చిన నేతలకు.. లేకపోతే టీడీపీ సూచనతో ఇతర పార్టీ ల నుంచి జనసేనలోకి వస్తున్న వారికే పవన్ సీట్లు ఇస్తుండటం చూసి వారంతా కొంత మెత్తబడ్డారు.

మరోవైపు ఆది నుంచి పార్టీలో ఉన్న నేతలు టికెట్ దక్కకపోవడంతో వారంతా తమ పదవులకు రాజీనామాలు చేసి వేరే పార్టీలో జాయిన్ అవుతున్నారు. మొత్తంగా జనసేన క్యాడర్ లో కొంత గందరగోళం కనిపిస్తోంది. దీంతో పార్టీ ప్రారంభంలో ఉన్న ఆ యూత్ జోష్, ఆ సీఎం వంటి నినాదాలు ప్రస్తుతం కనిపించడం లేదు.  కాకపోతే పార్టీని నమ్ముకున్న కొంతమంది నేతలు సర్దుకుపోతున్నారు. ఏదో వ్యూహంతోనే తమ అధినేత ఇలా పొత్తులు కుదుర్చుతున్నారు. తక్కువ సంఖ్యలో సీట్లు అడుగుతున్నారు అని కొంతమంది భావిస్తున్నారు. కానీ మెజార్టీ కార్యకర్తలు మాత్రం పవర్ షేరింగ్ లేదని తెలిసి నిరాశకు గురవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: