పొత్తుల పీకులాట.. చంద్రబాబుకు అసలు పరీక్ష?

ఏపీలో జగన్ అధికారానికి దూరం కావాలి. టీడీపీ, జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావాలి. ఈ లక్ష్యంతోనే చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ముందుకు సాగుతున్నారు. అతి కష్టం మీద బీజేపీని తమతో కలుపుకున్నారు. అయితే రెండు పార్టీల లక్ష్యం జగన్ ని గద్దె దించడం కాగా.. బీజేపీ మాత్రం తమ పార్టీ బలపడటం, ఏపీలో విస్తరించడం అనే విధానంతో కూటమితో జట్టు కట్టింది.

బీజేపీ పెద్దల నిర్ణయంతో అటు టీడీపీ శ్రేణుల్లో, ఇటు చంద్రబాబు నాయుడిలో ఫుల్ జోష్ నెలకొంది. పొత్తులో భాగంగా బీజేపీ జనసేనలకు కేటాయించిన 30 సీట్లలో ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత చంద్రబాబు పై ఉంది.  అలాగే ఈ మూడు పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు సక్రమంగా జరిగేలా చూడాలి. అలా అయితేనే ఈ కూటమికి విజయం చేకూరే అవకాశాలు ఉన్నాయి. లేకుంటే పరాభవం తప్పదు.

సాధారణంగా పార్టీ నాయకులు కలిసిపోయినంత సులభంగా కార్యకర్తలు కింది స్థాయిలో పనిచేయరు. అధినేత ఏం చెప్పినా.. గుడ్డిగా చేసేద్దాం అనే పరిస్థితి పార్టీ కార్యకర్తల్లో ఉండదు. ఇప్పటికే జనసేన, టీడీపీ ల మధ్య కొంత దూరం ఉంది. వీరిని సమన్వయం చేసేలా పార్టీ అధినేతలు వ్యూహాలు రచిస్తున్న తరుణంలో ఇప్పుడు బీజేపీ వచ్చి చేరింది.

గతంలో చంద్రబాబుపై కోపంతోనే బీజేపీ సానుభూతి పరులంతా వైసీపీకి మద్దతు తెలిపారు. ఈసారి వీరంతా తిరిగి మళ్లీ టీడీపీకి ఓటే వేస్తారా అంటే సందేహమే. జనసైనికులు అయితే సీఎం సీఎం వంటి నినాదాలతో పవన్ కల్యాణ్ సభలకు హాజరయ్యేవారు. టీడీపీతో జనసేనాని పొత్తు పెట్టుకున్నా సీఎం షేరింగ్ ఉంటుందని వారంతా ఆశించారు. వీరితో పాటు కాపులు కూడా రాజ్యాధికారం కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్ల కోరిక పవన్ ద్వారా నెరవేరుతుందని భావించారు. కానీ ఇది లేదని తేలిపోయింది. దీంతో ఇటు జనసైనికులు, అటు కాపులు ఈ కూటమి వైపు మళ్లుతారా అనేది ఎన్నికల తర్వాతే తేలనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: