కేసీఆర్ అవినీతి.. రేవంత్‌ అస్త్రంగా మారిందా?

తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బళ్లు ఓడలు.. ఓడలు బళ్లు అయ్యాయి. పదేళ్ల పాటు చక్రం తిప్పిన కేసీఆర్ ఇప్పుడు కనీసం అసెంబ్లీకి ముఖం కూడా చూపించలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాలుకి ఆపరేషన్ పేరుతో రెండు నెలల పాటు ఇంటికే పరిమితం అయ్యారు. అదిగో వస్తున్నారు.. ఇదిగో వస్తున్నారు. పులి జిల్లాలు చుట్టేస్తోంది.. అంటూ కేసీఆర్ ని ఓ రేంజ్ లో ప్రొజెక్ట్ చేశారు కేటీఆర్.  ప్రస్తుతం ఆ ఊసే లేకుండా పోయింది.

తాజాగా సీఎం రేవంత్ రెడ్డి తీస్తున్న గుంతలు ఎటు వైపు దారి తీస్తాయో.. ఎవర్ని ఊచలు లెక్కపెట్టి స్తాయో తెలియడం లేదు. మరోవైపు బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలను రోజుకొకటి చొప్పున కాంగ్రెస్ ప్రభుత్వం వెలుగులోకి తీసుకువస్తోంది. తెలంగాణలో ఇన్ని అవినీతి అక్రమాలు జరిగాయా అని ప్రజలే నోరెళ్లబెడుతున్నారు.

కాళేశ్వరాన్ని దేశంలోనే అతి పెద్ద కుంభకోణంగా నీటి పారుదల శాఖ reddy NALAMADA' target='_blank' title='ఉత్తమ్ కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ఉత్తమ్ కుమార్ రెడ్డి అభివర్ణించారు.  విద్యుత్తు, ప్రాజెక్టుల నిర్మాణాల్లో లోపాలను ఎండ గడుతున్నారు. అయితే ఇంతటి సోషల్ మీడియా యుగంతో పాటు డిజిటల్ హవా నడుస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అవినీతి ఎలా సాధ్యం అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రజల్లో కూడా ఇప్పుడు కొంత అవేర్ నెస్ వచ్చింది.

అయితే నేరుగా ప్రభుత్వం చేతికి మట్టి అంటకుండా ఉండేందుకు బీఆర్ఎస్ ఓ కొత్త వ్యూహానికి తెర లేపిందనే ఆరోపణలున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు లో మేడిగడ్డ నిర్మించేందుకు ఎల్ అండ్ టీ సంస్థ అడిగిన నిధులు రూ.1800 కోట్లు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.4500 కోట్లను మంజూరు చేసింది. అంటే దాదాపు రూ.2700 కోట్లు అదనంగా ఇచ్చారు.  ఇలా ఇచ్చి ఆ తర్వాత నగదు రూపంలో తీసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  ఎలా అంటే కూలీలకు డబ్బులు చెల్లించాలని అని చెప్పి ఈ సంస్థ రోజూ బ్యాంకుల నుంచి నగదు విత్ డ్రా చేస్తుంది. దీనికి సంబంధించి బ్యాంకర్లు లెక్కలు అడగరు. సాధారణంగా రూ.2లక్షలు డబ్బులు విత్ డ్రా అయితే లెక్కలు చూపించాలి. కానీ కొన్ని సంస్థలకు వీటికి మినహాయింపు ఉంటుంది. దీనిని అడ్డుపెట్టుకొని బీఆర్ఎస్ అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: