వైపీపీలోకి టీడీపీ లీడర్స్.. గాలి మారిందా?

ఏపీలో అధికార వైసీపీ ఇటీవల చేపట్టిన టికెట్ల మార్పు చేర్పుల వ్యవహారం తర్వాత ఆ పార్టీ అసంతృప్తి నాయకులు టీడీపీలో చేరారు. టికెట్ వస్తోందనే ఆశతో ఉన్నవారు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇలా కొంతమంది తమకు వైసీపీ టికెట్ దక్కలేదని పార్టీ మారారు. ఇటీవల కాలంలో టీడీపీలోకి వలసలు జోరందుకోవడంతో  ఆ పార్టీలో ఉత్సాహం నెలకొంది. అదే సమయంలో టీడీపీ నాయకుల నుంచి వ్యతిరేకత మొదలైంది.

దీంతో టీడీపీ నేతలు సైకిల్ దిగి ఫ్యాన్ కిందకి చేరేందుకు సంప్రదింపులు జరుపుతున్నారు. ఐదేళ్లుగా పార్టీ కార్యక్రమాలు చేపడుతూ  పార్టీని నిలబెట్టిన వారిని కాదని.. కొత్తగా వచ్చిన వారికి టికెట్లు ఇవ్వడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యే కొలను పార్థసారథి కి టికెట్ రాకపోవడంతో ఆయన టీడీపీ గూటికి చేరారు. ఆయన్ను నూజీవీడు ఇన్ఛార్జిగా ప్రకటించడంతో ఇప్పటి వరకు అక్కడ టీడీపీ కార్యక్రమాలు చేపట్టిన మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావు పార్టీ మారేందుకు సిద్ధం అయ్యారు.

ఈ మేరకు ఆయన వైసీపీ అధిష్ఠానంతో చర్చలు కూడా జరిపారు. ఈయనకు మైలవరం ఇస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. లేక ఎమ్మెల్సీ ఆఫర్ చేశారనేది మరో సమాచారం.  అలాగే పార్టీ మారిన కాంగ్రెస్ లో చేరిన ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్లీ సొంత గూటికి చేరారు.  దీంతో పాటు మరికొంత మంది సైకిల్ దిగేందుకు సిద్ధమయ్యారని సమాచారం. కాకపోతే దీనిని ఎవరూ ధ్రువీకరించలేదు. పొలిటకల్ సర్కిళ్లలో జరుగుతున్న ప్రచారం.

మచిలీపట్నం ఎంపీ స్థానాన్ని జనసేనకు కేటాయించినట్లే కాబట్టి అక్కడ టీడీపీ నేత కొనకళ్ల నారాయణ వైసీపీ నేతలతో సంప్రదింపులు జరిపారు అనే చర్చ నడుస్తోంది. రాయచూట్ మాజీ ఎమ్మెల్యే రెడ్డప్ప గారి రమేశ్ రెడ్డి, పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత కుటుంబం కూడా వైసీపీ వైపు చూస్తోంది అనే ప్రచారం జరుగుతోంది. కమలాపురం నుంచి సాయినాథ్ శర్మ, మైదుకూరు నుంచి వెంకటసుబ్బారెడ్డి లు ఎంపీ అవినాశ్ రెడ్డితో మంతనాలు సాగించారు. ఇవన్నీ ఎవరూ ధ్రువీకరించలేదు. కాకపోతే వీరంతా చేరతారా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: