బాబుకు తలనొప్పులు తెస్తున్న టికెట్ సర్కస్‌?

తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు సంకట పరిస్థితి. పొత్తు విషయంలో ఎటూ తేల్చుకోలేక ఆ పార్టీ అధినేత తెగ ఇబ్బంది పడుతున్నారు. కనీసం నోటా కన్నా తక్కువ శాతం ఓట్లు వచ్చిన బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు వెంపర్లాడటం ఆ పార్టీ నాయకులకు కూడా నచ్చడం లేదు. కానీ టీడీపీ అవసరం అలాంటిది. బీజేపీకి సీట్లు ఇస్తామని చెప్పడం లేదు. అలా అని ఇవ్వమని చెప్పడం లేదు. లోలోపల సతమతం అవుతున్నారు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.

చంద్రబాబు ఈ ఎన్నికల గురించి ఎంతలా ఆలోచిస్తున్నారో. తొలిసారి టీడీపీ ఒక ముప్పును ఎదుర్కొంటుంది. గతంలో వైఎస్సార్, రోశయ్య లాంటి నేతలు ఉన్నా  ఆపార్టీ క్యాడర్ చెక్కు చెదరలేదు. ఈ దఫా మాత్రం ఆ పార్టీ ఉనికి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఈసారి తన ప్రత్యర్థి జగన్ ను ఎదుర్కొనేందుకు సర్వ శక్తులూ ఒడ్డుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ ఎన్నికల్లో ఓడితే టీడీపీ ఉనికి ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి అయితే ఉంది.

అందుకే చంద్రబాబు ఇంతలా పోరాడుతున్నారు. ఓ వైపు పవన్ కల్యాణ్ ను చాలా వ్యూహాత్మకంగా మేనేజ్ చేస్తున్నారు. బీజేపీతో సంప్రదింపులు జరగుతున్నా విషయాలు బయటకి రావడం లేదు. ఇంత చేస్తున్నా పార్టీ నాయకులు మాత్రం కార్యకర్తల్లో చైతన్యం తీసుకు రాలేకపోతున్నారు. ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయలేకపోతున్నారు. గతంలో టీడీపీ ఇలాంటి పరిస్థితి ని ఎప్పుడు ఎదుర్కోలేదు.

ఏడు పదుల వయసులో చంద్రబాబు పడుతున్న కష్టాన్ని చూసి ఇతర నాయకులు స్ఫూర్తి పొంది కార్యకర్తల్లో చైతన్యం తీసుకురావాలి. ఆయన ప్రయత్నాలను గుర్తించాలి. సర్వ శక్తులు ఆయన ఎందుకు ఒడ్డుతున్నారో నేతలు గుర్తించి పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలి. కానీ సీటు దక్కదేమో అని కొంతమంది నాయకులు పార్టీలో అంతర్గత కలహాలు సృష్టించేలా, పొత్తులు చెడిపోయేలా ప్రకటనలు చేస్తూ గందరగోళానికి గురి చేస్తున్నారు. ఇలాంటి సమయంలో స్వార్థ రాజకీయాలు అవసరమా. టీడీపీ కార్యకర్తలు ఆత్మవిమర్శ చేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: