యుద్ధరంగంలోకి నేరుగా అడుగుపెట్టిన యువరాజు?

ఇజ్రాయెల్, హమాస్ల మధ్య దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇటు ఇజ్రాయెల్ దళాలు, అటు హమాస్ తీవ్రవాదుల దాడి, ప్రతి దాడులతో మధ్య ఆసియా ప్రాంతం దద్దరిల్లుతోంది. ఇప్పటికే పాలస్తీనా సమూలంగా నాశనమైంది. ఎటు చూసినా శిథిల భవనాలే దర్శనమిస్తున్నాయి. దీనికి తోడు ఇజ్రాయెల్ దళాలు బాంబుల వర్షం కురిపిస్తుంటే ఏం చేయాలో పాలుపోక అక్కడి ప్రజలు దయనీయ స్థితిలో ఉన్నారు.

ఇప్పుడు గాజాలో రెండు రకాల పరిస్థితులు కనిపిస్తున్నాయి. హమాస్ తీవ్రవాదులు అక్కడ రెచ్చిపోతున్నారు. అలా చెలరేగిపోతున్న వారిని నియంత్రించాల్సిన ముస్లిం దేశాలైన జోర్డాన్, ఈజిప్టు  చూసీ చూడనట్లు వ్యవహరించాయి. ఎందుకంటే హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ ను ఆక్రమించుకుంటే మరొక ముస్లిం దేశం ఏర్పడుతుందని భావించాయి. మరో మత రాజ్యం ఏర్పాటు  కానుందని సంతోషపడ్డాయి. కానీ వీరి ఊహలకు అందకుండా ఇజ్రాయెల్ ఎదురు తిరిగింది. దాడులకు పాల్పడింది. హమాస్ తీవ్రవాదుల వెంటపడి వేటాడుతోంది. ఈ క్రమంలో అమెరికా సహా పలు దేశాలు విధిస్తున్న ఆంక్షలను సైతం లెక్క చేయడం లేదు.

దీంతో హమాస్ తీవ్రవాదులను పక్కకు పెట్టి సాధారణ ప్రజలకు అన్యాయం జరగుతుందని ముస్లిం దేశాలు కొత్త రాగం అందుకున్నాయి.  యుద్ధాన్ని తక్షణమే ఆపాలని డిమాండ్ చేస్తున్న దేశాల్లో ఈజిప్టు, జోర్డాన్  లు ముందున్నాయి. ఇప్పటికీ కూడా ఇజ్రాయెల్ బందీలు హమాస్ చెరలో ఉన్నారనే విషయం పక్కకు పెట్టేసి.. గాజాలోని ప్రజలు తిండిలక ఇబ్బంది పడుతున్నారని ఉపన్యాసాలు ఇస్తున్నారు.

జోర్డాన్ యువ రాజు స్వయంగా ఓ విమానాన్ని నడుపుతూ గాజాలోకి ప్రవేశించారు. అక్కడి ప్రజలకు అవసరమైన ఆహారాన్ని, మందులను గాల్లో నుంచి వరద బాధితులకు సాయం అందించినట్లు జార విడిచారు. దీనిని తనకు తాను గొప్ప మానవతా వాదిగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే సరిహద్దుల్లో గేట్లు తెరిస్తే చాలు గాజాలోని నిరాశ్రయులు అంతా కూడా జోర్డాన్ లోకి వెళ్తారు. కానీ ఆ పని చేయరు.  గాజాలోని ముస్లింలను తమ దేశంలోకి  రావడానికి మాత్రం అనుమతి ఇవ్వరు. పైగా పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

war

సంబంధిత వార్తలు: