మోదీ ఆంధ్రప్రదేశ్‌కు ఇన్ని ఇచ్చారా?

మనకి  సంక్షేమ పథకాలు అమలు చేసేది రాష్ట్ర ప్రభుత్వం కదా.. మనకి కేంద్రం ఏమి ఇస్తుంది అని ప్రజలు అనుకుంటూ ఉంటారు. ఇదే క్రమంలో రాజకీయ నాయకులు కూడా కేంద్రం రాష్ట్రానికి ఏమీ ఇవ్వడం లేదు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఎక్కువ నిధులు.. వేరే ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలపై వివక్ష చూపిస్తోంది అని ఆరోపిస్తూ ఉంటారు. అయితే గత పదేళ్లలో ఏపీకి ఏం చేసిందో కేంద్రంలోని  బీజేపీ వివరించింది.

2014 తర్వాత రాష్ట్రంలో కోట్ల మంది దారిద్ర్య రేఖ నుంచి బయట పడ్డారు.  ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం ద్వారా రాష్ట్రంలో 2.68 కోట్ల మందికి ఉచితంగా రేషన్ అందజేస్తున్నామని ప్రకటించింది. 1.32 లక్షల మందికి జన్ ధన్ యోజన్ ద్వారా బ్యాంకు ఖాతాలు కల్పించి బ్యాంకింగ్ రంగానికి అనుసంధానం కల్పించింది. ఫలితం అవినీతి లేని పారదర్శక పాలనకు ఆస్కారం కలిగింది.

2014 తర్వాత బీజేపీ ప్రభుత్వం అవినీతి లేని భారత్ కు పునాది రాయి వేసింది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్సఫర్ ద్వారా 2019-24 వరకు లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 27,061కోట్లను జమ చేసింది.  ఉజ్వల పథకం ద్వారా 5.12లక్షల మందికి ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు అందిచారు. స్వచ్ఛ్ భారత్ ద్వారా 42లక్షల పైచిలుకు మరగుదొడ్లను నిర్మించారు. సుకన్య సమృద్ధి యోజన పథకం కింద మన రాష్ట్రంలో 15లక్షలకు పైగా ఖాతాలు తెరిచారు.

దీంతో పాటు అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా కోటిన్నర లబ్ధిదారులకు పైగా ఆయుష్మాన్ కార్డులు అందజేశారు. ఆర్థికంగా వెనుకబడిన కులాల వారికి పది శాతం రిజర్వేషన్లు కల్పిచారు. ప్రధానమంత్రి స్వ నిధి యోజన పథకం ద్వారా 2.59కోట్ల మంది వీధి వ్యాపారులకు రుణాలు ఇచ్చారు. ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన ద్వారా 2.09లక్షల కుటుంబాలు స్వాంతన పొందాయి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 60లక్షలకు పైగా రైతులకు ఆర్థిక సాయం అందజేస్తున్నారు. వీటితో పాటు మరి కొన్ని సంక్షేమ పథకాలను రాష్ట్రానికి అందిస్తున్నట్లు లెక్కలతో సహా వివరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: