ఏపీ రాజకీయాలను మార్చబోతున్న పవన్‌ ఢిల్లీ టూర్‌?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తుకు ముందు వారాహి యాత్రలతో జనంలో కనిపించారు.  ఎప్పుడు అయితే చంద్రబాబుని కలిసి పొత్తు ప్రకటించారో ఒక్కసారిగా ఆయన పార్టీ కార్యక్రమాలు తగ్గిపోయాయి.  ఇరు పార్టీల మధ్య సీట్ల విషయమై విభేదాలు తలెత్తినట్లు  వార్తలు వస్తున్న వస్తున్నాయి.  ఈ క్రమంలో ఆయన దిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

శుక్రవారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన జెండావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం దిల్లీ పయనమై వెళ్లారు. తమను సంప్రదించకుండా టీడీపీ టికెట్లు ప్రకటించుకుందని గుర్రుగా ఉన్న ఆయన రాజోలు. రాజానగరం సీట్లలో జనసేన పోటీ  చేస్తోందని వెల్లడించారు.  ఈ సమయంలో టీడీపీపై సుతిమెత్తని విమర్శలు చేశారు. తమకు చెప్పకుండానే సీట్లు కేటాయించుకోవడం, సీఎం సీటు విషయంలో వ్యాఖ్యలు చేయడం పొత్తు ధర్మానికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. అనంతరం పార్టీ నాయకులతో కలిసి రహస్య సమావేశం నిర్వహించారు.

ఈ నెల ఆఖరులోగా పార్టీ తన అభ్యర్థులను ఖరారు చేస్తోందని..ఆయన చెప్పినట్లు తెలిసింది. అనంతరం అనూహ్యంగా దిల్లీ పర్యటనకు తరలి వెళ్లారు. ఒకటి, రెండు రోజుల్లో ఆయన బీజేపీ పెద్దలతో సమావేశం అవుతారు. ముఖ్యంగా ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఏపీలో పొత్తుల గురించి ఏదో తేల్చేసుకుంటారని జనసేన వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటి వరకు బీజేపీ తమతో కలిసి వస్తుందని ఆశలతో ఉన్నామని.. అయితే ఆపార్టీ ఎటూ తేల్చకపోవడం.. క్షేత్రస్థాయిలో టికెట్లపై నాయకులు దూకుడు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో సహజంగానే పవన్ పై ఒత్తిడి పెరిగింది. బీజేపీతో పొత్తు ఉంటే ఆ టీడీపీ, జనసేన కలిసి సీట్లు పంచుకునే అవకాశం ఉంది. లేకపోతే కమ్యూనిస్టులు లేదా తమతో కలిసి వచ్చే పార్టీలతో ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఈనెలాఖరు వరకు తేల్చాయాలని ఉద్దేశంతో పవన్ దిల్లీ వెళ్లారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: