అన్ని కులాల వారికీ షాక్‌ ఇస్తున్న జగన్‌.. ఫలితం?

ప్రస్తుత అధికార వైసీపీలో ఇన్ఛార్జిల మార్పులు చేర్పులు అనే కార్యక్రమం అత్యంత ఆసక్తిగా జరుగుతోంది. ఇప్పటికే ఈ విషయంలో ఆ పార్టీ అధిష్ఠానం నాలుగు విడతలుగా జాబితాలను విడుదల చేసింది. ఇందులో భాగంగా పది పార్లమెంట్ స్థానాలకు, 58 లోక్ సభ స్థానాలకు ఇన్ఛార్జిల మార్పుల చేర్పులు జరిగాయి. ఈ క్రమంలో అయిదో విడత జాబితా సిద్ధం అవుతుందని చెబుతున్నారు.

దీనికోసం ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలను జగన్ పిలిపించుకుని మాట్లాడారని తెలుస్తోంది. కొత్తగా అవకాశం దక్కించుకున్న వారిని, సిట్టింగ్ ఎమ్మెల్యేలను సమన్వయం చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో కలిసి పనిచేయాలని నేతలకు సూచిస్తున్నారు. ఈ మార్పులు చేర్పులతో కొంతమంది పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు.   మరోపక్క ఫైనల్ జాబితా వెలువడిన అనంతరం వైసీపీలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొనే ప్రమాదం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  

అయితే దీనిని ఎల్లో మీడియా, చంద్రబాబు ప్రచార అస్త్రాలుగా మార్చుకుంటున్నారు.  వైసీపీకి పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఉండవల్లి శ్రీదేవిని పార్టీ నుంచి బహిష్కరించిన సందర్భంలో దళితులకు అన్యాయం, బీసీ అభ్యర్థులను మార్చిన చోట బీసీలను అణచి వేస్తున్న జగన్ వంటి కథనాలు ప్రచురిస్తున్నారు.

వాస్తవ పరిస్థితులు గమనిస్తే టికెట్ రాని నేతలు పార్టీ మారుతుంటారు. ఇందులో రెడ్డి, బీసీ, కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు మినహాయింపు ఏమీ కాదు.  తాజాగా నరసారావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఎంపీ పదవికి, పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయన్ను గుంటూరు నుంచి పోటీ చేయాలని పార్టీ ఆదేశించడంతో ఆయన ససేమమిరా అంటూ పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఆ స్థానాన్ని బీసీలకు ఇవ్వాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు సమాచారం. అయితే టికెట్ రాదనుకున్ననేతలు పార్టీ మారుతున్నారు. ఇదే వాస్తవం.  భవిష్యత్తులో టీడీపీ, జనసేన టికెట్లు ప్రకటించిన సమయంలో పార్టీ ఫిరాయింపులు జరిగే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: