ఏపీ: ఆ కూటమికి 150 అసెంబ్లీ.. 20 ఎంపీ సీట్లు ఖాయం?

మొన్న 22న అయోధ్యలో అట్టహాసంగా రామాలయం ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఆ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా వేల మందిని ఆహ్వానించారు. కానీ.. ఏపీ సీఎం జగన్‌కు మాత్రం ఆహ్వానం అందలేట. ఈ విషయాన్ని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు చెబుతున్నారు. అసలు అయోధ్య రామ మందిరం ఆహ్వానం సీఎం జగన్మోహన్ రెడ్డి కి లేదంటున్న బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు.. ఒక వేళ వచ్చి ఉంటే ,చూపించండని సవాల్ విసురుతున్నారు.

90 శాతం హిందువులు ఉన్న ఈ రాష్ట్రంలో రామ మందిర ప్రారంభోత్సవ రోజు సెలవివ్వలేదని.. బిజెపి-జనసేన మధ్య పొత్తు ఉంది, జనసేన-టిడిపి పొత్తు ఉంది, ఐతే ముగ్గురు కలవాలిసిఉందని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. ఈ మొత్తం కూటమికి 150 సీట్లు వస్తాయని..ఎంపీ లు కూడా 20 పైగా వస్తాయని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు చెబుతున్నారు. అసలు వైసిపి కి ఎందుకు ఓటు వెయ్యాలని ప్రశ్నిస్తున్న బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు.. ఏమి అభివృద్ధి చేసారని వేయ్యాలని అడిగారు.

జగన్.. మద్యపాన నిషేధం అమలు అన్నారని.. కానీ.. అధికారంలోకి వచ్చాక చెత్త బ్రాండ్ లతో ప్రాణాలు తీస్తున్నారని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు విమర్శించారు. ఇప్పుడు కూడా ఓటర్లు జాబితాలోతప్పులు తడకలు ఉన్నాయని.. బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు విమర్శించారు.

పెట్టుబడుల కోసం అన్ని రాష్ట్రాలు దావోస్ సభ కు వెళ్తుంటే.. మన సీఎంకు, పరిశ్రమల మంత్రి రాష్ట్రంపై నిర్లక్ష్యం ఉందని.. అందుకే దావోస్ వెళ్లకుండా ఆగిపోయారని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అంటున్నారు. షర్మిల రాక తో వైసిపి కి గట్టిగా దెబ్బ తగులుతుందని.. 10 నుంచి 12 శాతం ఓటు బ్యాంకు కాంగ్రెస్ కు వస్తుందని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అంచనా వేస్తున్నారు. మరి ఈ లెక్కలు ఎంత వరకు నిజం అవుతాయో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: