ఆ దేశం తాలిబన్లను ప్రయోగిస్తోందా?

రెండు మాసాలుగా సాగుతున్న ఇజ్రాయెల్ దురాక్రమణ పూరిత దాడులను ఆపాలని హమాస్, ఇజ్రాయెల్ మధ్య సంధికి దౌత్య మార్గాల ద్వారా యత్నించాలని అంతర్జాతీయ సమాజం నుంచి ఓ వైపు ఒత్తిడి పెరుగుతుంటే.. మరో వైపు గాజాలో మరి కొన్ని కుటుంబాలను తమ ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోవాలని నెతన్యాహూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.


ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకు 20వేలకు పైగా పాలస్తీనీయులు చనిపోయారు. వీరిలో 8000మంది చిన్నారులు ఉన్నారు. 6200మహిళలు, మరో 14 వేల మంది నిరాశ్రయులు ఉన్నారు.  అయితే ఆది నుంచి హమాస్ కు ఇరాన్ మద్దతుగా  ఉంది.  ఇప్పటికే లెబనాన్ నుంచి హిజ్బుల్లా తీవ్రవాదులను, యెమెన్ నుంచి  హౌతీలను,  సిరియా  నుంచి హౌతీ, హిజ్బుల్లాను వీరు చాలదన్నట్లు ఇరాక్ లోని ఇస్లామిక్ రెసిస్టెంట్ ఫోర్స్ ని వాడుతోంది. ఇన్ని తీవ్రవాద సంస్థలను ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రయోగిస్తోంది.


వీరు చాలదన్నట్లు కొత్త తీవ్రవాద సంస్థల నుంచి పలువురిని రిక్రూట్ మెంట్ చేసుకుంటున్నారు. ఎవర్ని అంటే ఆఫ్గాన్ లోని తాలిబన్లను.  ప్రస్తుతం ఆఫ్గాన్ లో ఆకలి కేకలు పెరిగిపోతున్నాయి.  అమెరికా ఆధ్వర్యంలో ప్రజా పరిపాలన సాగినంత కాలం  ఆఫ్గాన్ జీవితాలు అద్భుతంగా ఉన్నాయి. ఎప్పుడు అయితే అమెరికా తన సైన్యాన్ని ఉప సంహరించుకుందో మళ్లీ పరిస్థితులు యథా స్థానానికి వచ్చాయి. మళ్లీ మహిళలపై ఆంక్షలు మొదలయ్యాయి.


విడాకులు రద్దు చేయడంతో మాజీ భర్తలతోనే నచ్చినా నచ్చకపోయినా సంసారం చేయాల్సిన దారుణ పరిస్థితులు. మహిళల స్వేచ్ఛకు అక్కడ భద్రత లేకుండా పోయింది. దీంతో పాటు ప్రస్తుతం ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. తాలిబన్ల మధ్యే ఇప్పుడు అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి.  దీనివల్ల ఆఫ్గాన్ ప్రజలు దుర్భరజీవితం గడుపుతున్నారు.  ప్రస్తుతం ఉపాధి లేక అల్లాడుతున్న వారిని ఇరాన్ సైన్యం రిక్రూట్ చేసుకుంటుంది. వీళ్ల ద్వారా ఇజ్రాయెల్ పై సూసైడ్ బాంబు దాడి చేయోచ్చనది ఇరాన్ ఆలోచనగా విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: